తెలంగాణ

telangana

అద్భుత ప్రతిభ.. అగ్గిపుల్లలతో విమానం

By

Published : Oct 8, 2021, 11:04 AM IST

Updated : Oct 8, 2021, 11:50 AM IST

భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా బుల్లి విమానాన్ని తయారుచేశాడో విద్యార్థి. 1360 అగ్గిపుల్లలతో దీనిని రూపొందించడం విశేషం.

Air Force Day
Air Force Day

అగ్గిపుల్లలతో విమానం తయారు చేస్తున్న సశ్వత్ రంజన్ సాహూ..

ఒడిశాకు చెందిన సశ్వత్ రంజన్ సాహూ.. ఓ బుల్లి విమానాన్ని తయారు చేశాడు. అగ్గిపుల్లలను ఉపయోగించి అతను రూపొందించిందిన ఈ విమానం చూపరులను ఆకట్టుకుంటోంది. భారత వైమానిక దళ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని తయారుచేసినట్లు సాహూ తెలిపాడు. భారత సైన్యంలోని 'వెస్ట్‌ల్యాండ్ వాపిటి' విమానాన్ని పోలి ఉండే ఈ విమానాన్ని.. భారత వైమానిక దళానికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు.

అగ్గిపుల్లల విమానం
రంజన్ సాహూ తయారుచేసిన విమానం

33 అంగుళాల పొడవు, 40 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ విమానం తయారీకి ఐదు రోజుల సమయం పట్టిందని రంజన్ తెలిపాడు.

తాను రూపొందించిన విమానంతో సశ్వత్ రంజన్ సాహూ..

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2021, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details