తెలంగాణ

telangana

NIA Raids in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్​ఐఏ సోదాలు.. పలు పత్రాలు స్వాధీనం

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 8:34 PM IST

NIA Raids in Telugu States Today : ముంచింగిపట్టు మావోయిస్టు కుట్ర కేసులో భాగంగా ఎన్ఐఏ అధికారులు తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల సోదాలు నిర్వహించారు. 11 ప్రజా సంఘాలకు చెందిన నాయకుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి నగదు, మావోయిస్టు సాహిత్యంతో పాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Munchingipattu Maoist conspiracy case
NIA Raids in Telugu States

NIA Raids in Telugu States : మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA Raids) అధికారులు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. ఏపీలో 53 చోట్ల, తెలంగాణలో 9 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు.. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని గుంటూరు, పల్నాడు, విజయవాడ, రాజమండ్రి, ప్రకాశం, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, కడప, సత్యసాయి జిల్లా, అనంతపురం, కర్నూలులో పలువురు నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

NIA Searches in Telugu States: ఎన్ఐఏ సోదాలతో ఉలిక్కి పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు..

NIA Raids in Telangana :మరోవైపు తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్, హనుమకొండ, ఆదిలాబాద్​లలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో సత్యసాయి జిల్లాకు చెందిన చంద్ర నర్సింహులును అరెస్ట్ చేసి అతని నుంచి తుపాకి, 14రౌండ్ల బుల్లెట్లతో పాటు పాటు మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలో చేసిన తనిఖీల్లో 13లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్​లోని అల్వాల్​లో నివాసం ఉంటున్న అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవాని ఇంట్లో సోదాలు నిర్వహించారు.

విద్యానగర్​లో ఉంటున్న న్యాయవాది సురేష్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. 2021 మార్చ్ 31వ తేదీన కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు.. తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 25చోట్ల సోదాలు నిర్వహించారు. పలు ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి మావోయిస్టు సాహిత్యంతో పాటు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2020 నవంబర్ 23 న ముంచింగిపట్టు మండలం రుద్రకోట అటవీ ప్రాంతంలో పంగి నాగన్న అనే విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి మావోయిస్టు సాహిత్యం, కరపత్రికలు, ఎలక్ట్రికల్ వైర్లు, బాటరీలు స్వాధీనం చేసుకున్నారు.

NIA Raids in Andhrapradesh :మావోయిస్టు అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు సూచించిన మేరకు ఇవి మావోయిస్టులకు చేరవేయడానికి వెళ్తున్నట్లు పంగి నాగన్న పోలీసులకు తెలిపారు. దీంతో ముంచింగిపట్టు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముంచింగిపట్టు పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కేసు నమోదు చేశారు. 2021 మే 21న విజయవాడ ఎన్ఐఏ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసిన అధికారులు ఏడుగురిని నిందితులుగా చేర్చారు. అందులో 5గురు మావోయిస్టు అనుబంధ సంఘాలకు చెందిన వాళ్లే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Munchingipattu Maoist conspiracy case :పౌర హక్కుల సంఘం, అమరుల బంధు మిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ప్రజా కళా మండలి, విప్లవ రచయితల సంఘం, మానవ హక్కుల వేదిక, ప్రజా న్యాయవాదుల సంఘంతో పాటు పలు మావోయిస్టు అనుబంధ సంఘాలపై కేంద్రం 2009లోనే నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు అనుబంధ సంఘాలలో సభ్యులుగా ఉంటూ... మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు సమాచారం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.

ఎన్ఐఏ దాడులను పౌర హక్కుల సంఘం నేతలు ఖండించారు. అక్రమ కేసులను బనాయించి ప్రజాసంఘాల నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఫ్రొఫేసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. పలువురు ప్రజా సంఘాల నాయకుల ఇళ్లల్లో సోదాలు ముగిసిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థల అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్దేశించిన తేదీల్లో ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Civil Liberties Fires on NIA Raids : "ఉద్దేశపూర్వక ఎన్​ఐఏ దాడులు.. ఇదంతా పౌరహక్కుల ఉల్లంఘనే"

NIA Officials Conducted Search in Telangana : కోయంబత్తూరు బాంబు దాడి కేసులో.. తెలంగాణ, తమిళనాడులో ఎన్​ఐఏ సోదాలు

ABOUT THE AUTHOR

...view details