ETV Bharat / state

Civil Liberties Fires on NIA Raids : "ఉద్దేశపూర్వక ఎన్​ఐఏ దాడులు.. ఇదంతా పౌరహక్కుల ఉల్లంఘనే"

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 7:27 PM IST

NIA Raids in Telugu States
Civil Liberties Fires on NIA Raids in Telangana

Civil Liberties Fires on NIA Raids in Telangana : ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్​ఐఏ దాడులపై.. హైదరాబాద్ హైదర్​గూడలో పౌరహక్కుల నేతలు, విప్లవ రచయితల సంఘాల నాయకులు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులకు.. ఎన్​ఐఏ భంగం కలిగిస్తోందని పౌరసంఘాల నేతలు మండిపడ్డారు.

Civil Liberties Fires on NIA Raids in Telangana : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. అవినీతి నేతల బాగోతం బయటపడుతుందేమోనన్న భయంతో ప్రజా సంఘాల నాయకులపై ఎన్​ఐఏతో(NIA Raids) దాడులు చేయిస్తున్నారని పౌరహక్కుల నేతలు విమర్శించారు. ఎన్​ఐఏ దాడులకు నిరసనగా హైదర్​గూడలో సమావేశం నిర్వహించారు. ఈ దాడుల్లో మోదీకి(PM Modi), ఏపీ సీఎం జగన్​కి, తెలంగాణ సీఎం కేసీఆర్​కి సంబంధం ఉందని ధ్వజమెత్తారు.

NIA Searches in Telugu States: ఎన్ఐఏ సోదాలతో ఉలిక్కి పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు..

Civilrights Proteters fires on NIA raids : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నాయకులకు వ్యతిరేకంగా తెలుగు ప్రజానీకం ఏకమైందని.. ప్రజా సంఘాలు తమను ఎండగడతాయి అనే ఉద్దేశంతోనే రాజకీయ నేతలు ఎన్​ఐఏతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. నెల క్రితం మెదక్​లో పరీక్ష రాస్తున్న జయదేవ్ అనే వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ఉండగానే ఎన్​ఐఏ దాడులు చేస్తోంది అంటే.. కేవలం షో చేయడానికేనని పేర్కొన్నారు.

NIA Raids in Telugu States : ప్రజా సంఘాల నేతలపై తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేయడమే ఈ దాడుల ముఖ్య లక్ష్యమని మండిపడ్డారు. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో 60 చోట్ల ఎన్​ఐఏ దాడులు చేస్తోందని.. ఎన్నికల ముందు ఎక్కడికక్కడ ప్రజా సంఘాలను భయబ్రాంతులకు గురి చేసి.. బ్యాలెట్ బాక్సులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

Telangana State Civil Liberties Committee : మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో.. కవులు, రచయితలు, ప్రజా సంఘాల నేతలపై ఆకస్మిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులుగా లేని అనుమానం.. ఎన్నికల ముందే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఉఫా చట్టం పేరుతో హింసిస్తున్నారని.. ఈ చట్టాన్ని తొలగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ.. దానినే వాడుకుని ఎన్​ఐఏ అక్రమ దాడులకు పాల్పడుతోందన్నారు.

నిషేధిత వస్తువులు, పుస్తకాలను ఎన్​ఐఏ అధికారులు తీసుకొచ్చి.. ఇంట్లో పెట్టి, ఫోటోలు, వీడియోలు తీసి అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిని తీసుకెళ్లి జైళ్లలో పెడుతున్నారన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు కొందరు తమ ఇంటి గోడ దూకి కొందరు ఇంట్లోకి వచ్చారని.. తన భార్య ఆత్మకూరు భవాని పేరుతో సెర్చ్ వారెంట్ ఇచ్చారని బాధితుడు కృష్ణ తెలిపారు.

"మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో ఎన్​ఐఏ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. ఈ దాడులు పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ దాడుల వెనుక రాజకీయ నేతల హస్తం ఉంది. ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయిస్తున్నారు". - నారాయణరావు, పౌర హక్కుల నేత

Civil Liberties Fires on NIA Raids "ఉద్దేశపూర్వక దాడులతో.. పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు"

Varalaxmi Sarathkumar Drugs : నటి వరలక్ష్మికి ఎన్​ఐఏ నోటీసులు!.. క్లారిటీ ఇదిగో..

NIA Raids in Karimnagar Today : కరీంనగర్‌లో NIA అధికారుల సోదాలు.. అతడి కోసం గాలింపు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.