తెలంగాణ

telangana

గ్యాంగ్​స్టర్లు, ఉగ్రవాదులకు లింకులు.. ఆ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

By

Published : Oct 18, 2022, 10:51 AM IST

Updated : Oct 18, 2022, 1:09 PM IST

ఉగ్రముఠాలు, గ్యాంగ్​స్టర్ల మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

NIA raids at multiple locations across states
nia raids in india

ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న ముఠాలను ఏరివేసే లక్ష్యంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు చేపట్టింది. గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్‌ స్మగ్లర్లు, మనుషుల అక్రమ రవాణా చేసే ముఠాలకు... ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికే ఈ తనిఖీలు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఉత్తర భారతదేశంలోని పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీ-ఎన్​సీఆర్​లోని వివిధ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఈ దాడులు చేపట్టాయి.

డ్రోన్ల అక్రమ చొరబాటుకు సంబంధించి ఈనెల 14న జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. గత 9 నెలలుగా పాకిస్థాన్‌ నుంచి భారత భూభాగంలోకి దాదాపు 191 డ్రోన్లు అక్రమంగా చొరబడినట్లు అధికారులు వెల్లడించారు. ఇది దేశ అంతర్గతభద్రతకు సంబంధించిన అంశం కావడంతో భద్రతాబలగాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతకుముందు గతనెల 12న దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ ముఠాలు సైబర్‌ స్పేస్‌ను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ ఆరోపించింది.

Last Updated :Oct 18, 2022, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details