తెలంగాణ

telangana

New Parliament Open Today : భారత స్వాతంత్ర్య ప్రయాణంలో కీలక ఘట్టం.. కొత్త పార్లమెంట్​ భవనంలో కార్యకలాపాలు ప్రారంభం

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 2:11 PM IST

Updated : Sep 19, 2023, 4:22 PM IST

New Parliament Open Today : నూతన పార్లమెంట్‌ భవనంలోకి అడుగుపెట్టారు ఉభయసభల సభ్యులు. దీంతో భారత స్వాతంత్ర్య ప్రయాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైనట్లైంది. మంగళవారం మధ్యాహ్నం కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్లారు ఎంపీలు.

new-parliament-open-today-mps-walk-from-old-parliament-building-to-new
new-parliament-open-today-mps-walk-from-old-parliament-building-to-new

New Parliament Open Today :భారత స్వాతంత్ర్య ప్రయాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతన పార్లమెంట్‌లో కార్యకలపాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌ పాత భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభల సభ్యుల కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా కేంద్రమంత్రులు, ఎన్​డీఏ కూటమిలోని మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు.

'భారత్ మాతాకీ జై' అంటూ కొత్త పార్లమెంట్​లోకి..
అనంతరం సభ్యులంతా 'భారత్‌ మాతాకీ జై' అంటూ నినదిస్తూ కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. సెంట్రల్‌ హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని నూతన భవనంలోకి తరలించారు. కాంగ్రెస్‌ నేతలు భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరీ రాజ్యాంగాన్ని చేతపట్టగా రాహుల్‌గాంధీ సహా మిగిలిన సభ్యులు నూతన పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం జనగణమణ గీతంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

Old Parliament Building Name : నూతన పార్లమెంట్​లో తొలిసారిగా మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా.. ప్రజా సమస్యలపై చర్చించే సమయంలో కొత్త ఒరవడిని సృష్టించాలని సభ్యులకు పిలుపునిచ్చారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన స్పీకర్​.. కొత్త పార్లమెంట్​లోకి మారడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు, రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించారు. ఇక నుంచి పార్లమెంట్ పాత భవనాన్ని సంవిధాన్ సదన్​గా పిలువనున్నట్లు వెల్లడించారు స్పీకర్ ఓం బిర్లా. సభలో ఉపయోగించే పదాలైన.. హౌజ్​, లాబీ, గ్యాలరీలను.. కొత్త పార్లమెంట్​గా వ్యవహరించాలని చెప్పారు. అంతకుముందు పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్​లో మాట్లాడిన ప్రధాని మోదీ.. పాత భవనాన్ని సంవిధాన్‌ సదన్‌గా పిలుచుకుందామని సలహా ఇచ్చారు. రాజ్యాంగకర్తల స్ఫూర్తిని భావితరాలకు అందిద్దామని తెలిపారు.

Modi Speech In New Parliament : మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసినట్లు ప్రధాని మోదీ స్వయంగా నూతన పార్లమెంట్‌ వేదికగా ప్రకటించారు. 'నారీ శక్తి వందన్‌ అభియాన్‌' పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మోదీ తెలిపారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఎంపీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారన్న మోదీ... అనేక రంగాల్లో మహిళలు నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. కొత్త భవనంలో నారీశక్తిని బలోపేతం చేసేలా... తొలి నిర్ణయం తీసుకోబోతున్నామని ప్రకటించారు. అభివృద్ధి ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం మరింత పెంచాలనుకుంటున్నామని మోదీ తెలిపారు.

Women Reservation Bill 2023 Today in Lok Sabha : లోక్​సభ ముందుకు మహిళా బిల్లు.. ఆమోదం ఎప్పుడంటే..

PM Modi Speech in Parliament Today : ఎన్​డీఏ సర్కార్ నిర్ణయాలతో భారత్​లో కొత్త జోష్​: ప్రధాని మోదీ

Last Updated :Sep 19, 2023, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details