ETV Bharat / bharat

PM Modi Speech in Parliament Today : ఎన్​డీఏ సర్కార్ నిర్ణయాలతో భారత్​లో కొత్త జోష్​: ప్రధాని మోదీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 12:33 PM IST

Updated : Sep 19, 2023, 12:59 PM IST

PM Modi Speech in Parliament Today : పార్లమెంట్ పాత భవనంలో చివరిసారిగా మాట్లాడారు ప్రధాని మోదీ. మన రాజ్యాంగం ఈ సెంట్రల్‌ హాల్‌లోనే రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారం అందుకున్నది కూడా ఇక్కడేనని అన్నారు. ఇకపై పాత పార్లమెంట్‌ భవనాన్ని సంవిధాన్‌ సదన్‌గా పిలుచుకుందామని సూచించారు.

PM Modi Speech in Parliament Today
PM Modi Speech in Parliament Today

PM Modi Speech in Parliament Today : పార్లమెంట్‌ సెంట్రల్ హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన రాజ్యాంగం ఈ సెంట్రల్‌ హాల్‌లోనే రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారం అందుకున్నది కూడా ఈ సెంట్రల్‌ హాల్‌లోనే గతనాటి జ్ఞాపకాలను ప్రధాని మోదీ నెమరు వేసుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో సమావేశం ఎంతో భావోద్వేగంతో కూడుకున్నదని తెలిపారు మోదీ. ఎన్​డీఏ సర్కార్​ తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్‌లో కొత్త చైతన్యం వస్తోందని వెల్లడించారు. పార్లమెంట్ పాత భవనంలోని లోక్​సభ సెంట్రల్​ హాల్​లో చివరిసారిగా ప్రధాని మోదీ ప్రసంగించారు.

"తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్‌ తలాక్‌ చట్టాలను ఇక్కడే ఆమోదించుకున్నాం. ఆర్టికల్‌ 370 నుంచి విముక్తి కూడా ఈ పార్లమెంట్ ద్వారానే జరిగింది. ఇక్కడి నుంచే 4 వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం. 1952 నుంచి 41 మంది వివిధ దేశాధ్యక్షులు ఇక్కడి నుంచి ప్రసంగించారు. రాష్ట్రపతులు 86 సార్లు ఈ సెంట్రల్ హాల్‌ నుంచి ప్రసంగించారు. " అని మోదీ తెలిపారు.

దేశ ఆకాంక్షలకు అనుగుణంగా చర్చలు
మనం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటామో అంత వేగంగా ఫలితాలు వస్తాయన్నారు ప్రధాని. సాంకేతికతను అందించడంలో మన దేశ యువత ముందువరుసలో ఉందని తెలిపారు. యూపీఐ, డిజిటల్‌ టెక్‌ వంటి సాంకేతికతలతో దేశం దూసుకెళ్తోందని పేర్కొన్నారు. కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడి కొత్త చట్టాలను స్వాగతించాలని సభ్యులకు సూచించారు మోదీ. పార్లమెంటులో జరిగే ప్రతిచర్చ దేశ ఆకాంక్షలను ప్రతిబింబించాలన్నారు. మనం తెచ్చే సంస్కరణలు దేశవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు.

"చిన్న పటంలో పెద్ద చిత్రాన్ని గీయలేం. పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా పెద్ద మార్పులు తీసుకురాలేం. భవిష్యత్‌ తరాల కోసం నవ్య, దివ్య సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది. మన యూనివర్సిటీలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలి. 1500 ఏళ్ల క్రితమే ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు భారత్‌లో ఉండేవి. జీ20 సమావేశాల్లోనూ నలంద విశ్వవిద్యాలయాల చిత్రాలు ప్రదర్శించాం." అని మోదీ వ్యాఖ్యానించారు.

100 జిల్లాల ప్రత్యేకంగా అభివృద్ధి..
అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమైనప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుందని ప్రధాని అన్నారు. దేశంలో 100 జిల్లాలను ఎంచుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ 100 జిల్లాలు దేశంలోని మిగిలిన జిల్లాలకు నమూనాలుగా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉందన్న మోదీ.. విశ్వ మిత్రగా భారత్‌ గుర్తింపు తెచ్చుకుంటోందని వివరించారు. తయారీ రంగంలో దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని మోదీ పేర్కొన్నారు.

సంవిధాన్‌ సదన్‌గా పాత పార్లమెంట్‌ భవనం..
ఇకపై పాత పార్లమెంట్‌ భవనాన్ని సంవిధాన్‌ సదన్‌గా పిలుచుకుందామన్నారు ప్రధాని మోదీ. రాజ్యాంగకర్తల స్ఫూర్తిని భావితరాలకు అందిద్దామని తెలిపారు.

Last Updated :Sep 19, 2023, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.