తెలంగాణ

telangana

Nainital Bus Accident : లోయలో పడ్డ టూరిస్ట్​ బస్సు.. నలుగురు మృతి.. కొండచరియలు విరిగిపడి మరో 8 మంది..

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 10:27 PM IST

Updated : Oct 8, 2023, 11:01 PM IST

Nainital Bus Accident : ఉత్తరాఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. మరోవైపు పితౌరాగఢ్​ జిల్లాలో 8 మందితో వెళ్తున్న బొలేరో వాహనంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు.

School Bus Falls Into Ditch In Nainital Of Uttarakhand
Nainital Bus Accident

Nainital Bus Accident : 32 మందితో ప్రయాణిస్తున్న టూరిస్ట్​ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఓ లోయలో పడిపోయింది. ఉత్తరాఖండ్​లో ఆదివారం జరిగిన ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నైనితాల్​ జిల్లాలోని కాలాడుంగీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బస్సు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలతో కలిసి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

కాగా, ఇప్పటివరకు 22 మందిని రక్షించినట్లు నైనితాల్ ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనా ఈటీవీ భారత్‌కు తెలిపారు. చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు. అయినప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆమె వివరించారు.

"ప్రమాదం జరిగిన బస్సులో టూరిస్టులు, పాఠశాల సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి."

- ప్రహ్లాద్ నారాయణ్ మీనా, నైనితాల్ ఎస్‌ఎస్పీ

కొండచరియలు విరిగిపడి మరో 8 మంది మృతి
Landslide In Uttarakhand : మరోవైపు పితౌరాగఢ్​ జిల్లా ధార్చుల సబ్‌డివిజన్​ కైలాష్ మానసరోవర్ రోడ్డులోని థాక్తి ప్రాంతంలో 8 మందితో వెళ్తున్న బొలేరో వాహనంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే మరణించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బుండి నుంచి వస్తున్న వాహనం ప్రమాదానికి గురైందని ధార్చుల సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దివేష్ షష్ని తెలిపారు. కొండచరియలు విరిగిపడటం వల్ల వాహనం శిథిలాల కింద కూరుకుపోయిందని ఆయన చెప్పారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, ఆర్మీ దళాలు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ వరుస ఘటనలకు తోడు కేదార్‌నాథ్​ జాతీయ రహదారి మార్గంలో గౌరీకుండ్ సమీపంలోని కొండపై నుంచి కూడా బండరాళ్లు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Friend Carries Body On Scooty : ఫ్రెండ్​ను చంపి మృతదేహాంతో స్కూటీపై సవారీ.. వాళ్లు చూడగానే..

171 Kg Bahubali Roti In Rajasthan : 171 కిలోల 'బాహుబలి రొట్టె'.. గిన్నిస్​ రికార్డులో చోటు కోసం యత్నం

Last Updated :Oct 8, 2023, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details