తెలంగాణ

telangana

Nagaland Firing Shah: నాగాలాండ్​ కాల్పులపై పార్లమెంటులో షా ప్రకటన

By

Published : Dec 6, 2021, 10:38 AM IST

Nagaland Firing Shah: నాగాలాండ్‌లో పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై పార్లమెంటులో కేంద్రహోం మంత్రి అమిత్​ షా మాట్లాడనున్నారు. మొదట లోక్​సభలో తర్వాత రాజ్యసభలో ఈ ఘటనపై షా ఓ ప్రకటన చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

amit shah
అమిత్​ షా

Nagaland Firing Shah: నాగాలాండ్​లో భద్రత బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మృతిచెందడంపై హోంమంత్రి అమిత్​షా పార్లమెంటులో మాట్లాడనున్నారు. సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులోని రెండు సభల్లో షా మాట్లాడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొదట లోక్​సభలో తర్వాత రాజ్యసభలో ఈ ఘటనపై అమిత్ షా ఓ ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నాయి.

నాగాలాండ్​లో మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపాయి భద్రతా బలగాలు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నాగాలాండ్- మయన్మార్ సరిహద్దుల్లో మోన్ జిల్లాలో జరిగినట్లు పేర్కొన్నారు.

Nagaland Firing Incident:

సామాన్య కూలీలపై..

బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు వెళ్తుండగా మోన్​ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జరిగాయి. కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్నారు. అయితే, మిలిటెంట్ల కదలికలున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన బలగాలు.. కాల్పులు జరిపాయి. అయితే, కాల్పుల్లో పౌరులే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

ఈ పరిణామంతో జిల్లాలోని ఓటింగ్​ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగాల వాహనాలను తగులబెట్టారు.

బలగాల పొరపాటు వల్లే ఘటన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు జరిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు.

Tags:nagaland firing, nagaland firing incident, nagaland news, amit shah news

ABOUT THE AUTHOR

...view details