తెలంగాణ

telangana

కొడుకు ఆరోగ్యం బాగుపడాలని కూతుర్ని బలి ఇచ్చిన తల్లి!

By

Published : Nov 6, 2022, 6:33 PM IST

Updated : Nov 6, 2022, 7:47 PM IST

మూఢ నమ్మకంతో ఓ తల్లి.. కొడుకు కోసం కూతురిని చంపుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన కొడుకు ఎవరినైనా బలి ఇస్తే ఆరోగ్యంగా ఉంటాడని భావించిన ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన రాజస్థాన్​లో​ జరిగింది.

Mother killed daughter
కూతురిని చంపిన తల్లీ

రాజస్థాన్​లో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మూఢ నమ్మకాలతో తన 12 సంవత్సరాల కూతురిని గొంతుకోసి చంపింది ఓ తల్లి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన 16 ఏళ్ల కొడుకు కోసం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిపింది.
"బారాన్​ జిల్లా అంట ప్రాంతంలో రేఖ హదా అనే మహిళ తన 16 ఏళ్ల కొడుకు నికేంద్ర సింగ్‌ను ఎంతో ప్రేమగా చూసుకునేంది. అతడికి గుండెలో రంధ్రం ఉంది. మానసిక స్థితి కూడా బాగుండేది కాదు. అతడి ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతున్న ఆమె ఎవరినైనా బలి ఇస్తే పెద్ద కొడుకు ఆరోగ్యంగా ఉంటాడని భావించింది. దాంతో ఈ హత్యకు పాల్పడింది." అని డీఎస్​పీ తరుణ్​కాంత్ సోమాని తెలిపారు.

ఈ మూఢ నమ్మకంతోనే ఆ మహిళ శనివారం తన కూతురు సంజనను గొంతు కోసి చంపిందని పోలీసులు తెలిపారు. మొదట తన చిన్న కొడుకు సింఘంపై దాడి చేయగా అతడు తప్పించుకున్నాడని.. అనంతరం సంజనను హత్య చేసిందని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం తన భర్తపైనా ఇలానే దాడి చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.

8 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం:
8 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఛత్తీస్​గఢ్ కోర్బా జిల్లా బంగో పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఆదివారం మేకలను మేపడానికి వెళ్లిన బాలికపై అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గాయాలతో భయంగా ఇంటికొచ్చిన బాలికను గమనించిన ఆమె తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా జరిగిన ఘటన గురించి చెప్పింది. అనంతరం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Last Updated :Nov 6, 2022, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details