తెలంగాణ

telangana

హత్య గుట్టు విప్పిన యాక్సిడెంట్.. బైక్​పై శవంతో అడ్డంగా బుక్కై...

By

Published : May 12, 2022, 7:38 PM IST

Murder case revealed by Accident
Murder case revealed by Accident ()

Karnataka Accident Murder case: మహిళను హత్య చేశాడు.. ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు మరికొందరితో కలిసి పన్నాగం పన్నాడు.. అయితే కథ అడ్డం తిరిగింది.. దురదృష్టం వెంటాడింది.. శవాన్ని తీసుకెళ్తుండగా బైక్ ప్రమాదానికి గురైంది.. అంతే అందరూ బుక్కయ్యారు.

Karnataka Accident Murder: కర్ణాటకలో జరిగిన ఓ యాక్సిడెంట్ మర్డర్ కేసును బయటపెట్టింది. రామనగరలోని జిల్లా జైలు కార్యాలయం సమీపంలో ఓ బైక్ స్కిడ్ అయి పడిపోగా.. హత్య జరిగిన విషయం విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. బైక్ పై నుంచి పడిపోవడం వల్లే ఆమె చనిపోయిందని నిందితులు తొలుత బుకాయించారు. అయితే, శవపరీక్షలు నిర్వహించగా అసలు నిజం బయటపడింది.

బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్​కు చెందిన ఉండే సౌమ్య అనే యువతికి దుర్గ అనే స్నేహితుడు ఉన్నాడు. గడిచిన ఆరు నెలలుగా సౌమ్య, దుర్గ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఓ మ్యారేజ్ హాల్​లో దుర్గ పనిచేస్తున్నాడు. సౌమ్య కూలీ పనికి వెళ్తోంది. అయితే, కొద్దిరోజుల క్రితం సౌమ్య.. దుర్గ ఇంట్లో నుంచి బంగారం, నగదును అపహరించుకొని పారిపోయింది. మరో వ్యక్తి వద్ద లోన్ తీసుకుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి దుర్గ ఇంటికి వచ్చి డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. ఓవైపు డబ్బులు, నగదు చోరీ కావడం.. మరోవైపు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి పెంచుతుండటం వల్ల దుర్గ తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీంతో దుర్గ సోమవారం సౌమ్య వద్దకు వెళ్లి తీవ్రంగా హింసించాడు. విచక్షణ లేకుండా చితకబాదడం వల్ల.. ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Karnataka Crime news:కాగా, సౌమ్య భర్త రఘుకు సమాచారం ఇచ్చాడు దుర్గ. అతడితో చెయ్యి కలిపి సౌమ్య మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. రఘు తన స్నేహితులైన అభి, వినోద్, నాగరాజును పిలిపించుకున్నాడు. అందరూ కలిసి సౌమ్య మృతదేహాన్ని నదిలో పడేయాలని అనుకున్నారు. దుర్గ, అభి, రఘు రెండు వేర్వేరు బైక్​లపై బయల్దేరారు. వినోద్, నాగరాజు.. సౌమ్య మృతదేహంతో పాటు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. దారిలో రోడ్లపై గుంతలను సరిగా చూసుకోకుండా ప్రయాణించడం వల్ల నాగరాజు, వినోద్ వెళ్తున్న బైక్ అదుపుతప్పింది. వీరికి గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్​లు
ప్రమాదానికి గురైన స్కూటీ ఇదే

అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జైలు కార్యాలయం వద్దే ప్రమాదం జరిగిన నేపథ్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వినోద్, నాగరాజుతో పాటు సౌమ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ గురించి పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో.. బైక్ ప్రమాదంలోనే సౌమ్య చనిపోయిందని పోలీసులను నమ్మించేందుకు నిందుతులు ప్రయత్నించారు. అయితే, శవపరీక్షలో అసలు నిజం తేలింది. 12 గంటల ముందే ఆమె చనిపోయిందని నివేదికలో వెల్లడైంది. దీంతో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు. బైక్ ప్రమాదం తర్వాత దుర్గ, రఘు పరార్ అయ్యారని.. వారిని గుర్తించి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అభి కోసం వెతుకుతున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:

హత్య కేసులో బెయిల్​పై రిలీజ్​.. పెళ్లికి ఒప్పుకోలేదని గర్ల్​ఫ్రెండ్​ దారుణ హత్య

'తాజ్​మహల్​లో హిందూ దేవతా విగ్రహాలు' పిటిషన్ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details