ETV Bharat / bharat

కేజ్రీవాల్​కు ఊరట!- మధ్యంతర బెయిల్​పై విచారణకు సుప్రీం ఓకే - Delhi Liquor Scam Case

author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 4:50 PM IST

Updated : May 3, 2024, 6:53 PM IST

Kejriwal ED Supreme Court
Kejriwal ED Supreme Court (ANI)

Kejriwal ED Supreme Court : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు చెప్పింది. మే 7న ఈడీ తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని అడిషినల్​ సొలిసిటర్​ జనరల్​ను ఆదేశించింది.

Kejriwal ED Supreme Court : దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు స్వల్ప ఊరట లభించింది! లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్​ పిటిషన్​పై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. మే 7న ఈడీ తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలని అడిషినల్​ సొలిసిటర్​ జనరల్​ను ఆదేశించింది. జస్టిస్​ సంజీవ్​ ఖన్నా, జస్టిస్​ దీపాంకర్​ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈమేరకు స్పష్టం చేసింది.

'పిటిషన్​ విచారిస్తాం- బెయిల్​ ఇవ్వడం లేదు'
'ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా అరవింద్​ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఆయన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ విచారణను పరిశీలిస్తాం' అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దీనిపై స్పందించిన ఈడీ తరఫు న్యాయవాది అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని కోర్టుకు చెప్పారు. దాంతో మరింత స్పష్టతనిచ్చిన ధర్మాసనం 'కేవలం పిటిషన్‌ను మాత్రమే విచారిస్తాం, బెయిల్‌ ఇస్తామని చెప్పడం లేదు. చివరకు బెయిల్‌ ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు' అని చెప్పింది. ఇందుకు సంబంధించి వాదనల కోసం సిద్ధమై మే7న రావాలని ఈడీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

'ఎన్నికల ముందే ఎందుకు అరెస్ట్​ చేశారు?'
దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మార్చి 21న అరెస్టు అయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని ఏప్రిల్‌ 15న ఈడీకి నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంపై ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతకుముందు తనను ఈడీ అరెస్ట్ చేయడంపై ఆయన దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆయన్ను ఈడీ అరెస్టు చేయడాన్ని సమర్థించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

'సీఎం విధులకు ఎవరైనా అంతకాలం దూరంగా ఉండొచ్చా?'- కేజ్రీవాల్ అరెస్టుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - Arvind Kejriwal Delhi High Court

'కావాలనే కేజ్రీవాల్ అవన్నీ తింటున్నారు- అంతా బెయిల్ కోసమే!' - Kejriwal Arrest

Last Updated :May 3, 2024, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.