తెలంగాణ

telangana

156 డేస్​.. 24000 కిలోమీటర్స్.. అమ్మ కోసం జర్మనీ నుంచి భారత్​కు బైక్​ రైడ్

By

Published : Dec 9, 2022, 4:30 PM IST

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లాక్​డౌన్​లో వివాహం జరిగింది. జర్మనీలో జరిగిన ఈ వేడుకకు కొవిడ్​ ఆంక్షల వల్ల యువతి కుటుంబ సభ్యులు రాలేకపోయారు. దీంతో విచారించిన ఆ యువతి తమ కుటుంబసభ్యులను ఎలగైనా కలావాలనుకుంది. ఆ మాటకు తన భర్త కూడా ఓకే అన్నారు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్​. 24000 కిలోమీటర్లు బైక్​పై ప్రయాణించి ఆ జంట ఎట్టకేలకు ముంబయికు చేరుకుంది.

couple travelled from germany to mumbai
couple travelled from germany to mumbai

సాధారణంగా జర్మనీ నుంచి భారత్​కు రావాలంటే ఎవరైనా సరే విమానంలో వస్తారు. కానీ మేధా రాయ్​ అనే ఈ యువతి మాత్రం బైక్​పై అంత దూరం నుంచి భారత్​కు వచ్చింది. ఇంతకీ ఈమె అడ్వెంచర్​ చేసేందుకో లేక గిన్నిస్ రికార్డు సృష్టించేందుకో ఇదంతా చేయలేదు. ఎంతో కాలం నుంచి తన తల్లిదండ్రులను కలవాలనుకుని ఇలా డిఫరెంట్​గా ప్రయాణించింది. ​

జర్మనీకి చెందిన హాక్​ విక్టర్​ 2013లో ముంబయికి వచ్చాడు. దాదాపు ఒకటిన్నర ఏడాది గడిపిన అతనికి మేధాతో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ 2021 లాక్​డౌన్​లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ కొవిడ్​ ఆంక్షల కారణంగా ముంబయిలో ఉన్న మేధా కుటుంబం జర్మనీకి వెళ్లలేకపోయింది. దీంతో నిరాశ చెందిన యువతి ఆంక్షల సడలింపు తర్వాత తన కటుంబాన్ని కలుసుకునేందుకు నిశ్చయించుకుంది. ప్రయాణం ఎలా చేయాలన్న విషయంలో కాస్త వినూత్నంగా ఆలోచించింది. రహదారి మార్గంలోనే జర్మనీ నుంచి భారత్​కు వెళ్లాలని అనుకుంది. అంతే ఇంకెందుకు ఆలస్యమంటూ బైక్​ ఎక్కి ముంబయి వచ్చేశారు మేధా-హాక్.

మేధా హాక్​ జంట
బైక్​ ప్రయాణంలో మేధా

వాస్తవానికి వారిద్దరూ కార్​లో ప్రయాణించాలని తొలుత అనుకున్నారు. కానీ దారి ఖర్చులు ఎక్కువవుతాయని భావించిన ఆ జంట బైక్​ ప్రయాణాన్ని ఎంచుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అంతలోనే ఓ చిక్కు వచ్చింది. ఒకే బైక్​పై ఇద్దరు అంత దూరం ప్రయాణిస్తే వెనుక కూర్చున్న వ్యక్తికి వెన్ను నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే వారిద్దరూ మరో బైక్​ కొన్నారు. అప్పటికి మేధాకు బైక్​ నడపడం అసలు రాదట. కేవలం ఈ ప్రయాణం కోసమే ఆమె బైక్​ నడపడం నేర్చుకుంది. అలా 156 రోజుల జర్నీలో 18 దేశాలు దాటి చివరకు ముంబయికి చేరుకుంది మేధా-హాక్​ జంట.

మేధా హాక్​ జంట

TAGGED:

ABOUT THE AUTHOR

...view details