తెలంగాణ

telangana

విడుదల ఆలస్యం.. ఈ రాత్రికి జైలులోనే ఆర్యన్​ఖాన్!

By

Published : Oct 29, 2021, 7:07 PM IST

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ విడుదల మరో రోజుకు వాయిదా పడింది. జైలు నుంచి శుక్రవారం విడుదలవుతాడని భావించినప్పటికీ.. బెయిల్​కు సంబంధించిన ఆర్డర్‌ కాపీ తమకు అందలేదని ముంబయి ఆర్ధర్‌ రోడ్‌ జైలు అధికారులు తెలిపారు.

aryan khan
ఆర్యన్​ఖాన్

క్రూయిజ్​ షిప్​ డ్రగ్స్​ కేసులో అరెస్టయిన ఆర్యన్​ ఖాన్​ విడుదల మరోరోజుకు వాయిదా పడింది. సాయంత్రం వరకూ ఆర్డర్‌ కాపీ అందకపోవడం వల్ల ఆర్యన్‌ఖాన్ ఇవాళ విడుదల కావడం లేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. దీనితో ఆర్యన్​ శుక్రవారం రాత్రి సైతం జైలులోనే గడపనున్నారు.

"మేము ఎవరికోసమూ నిబంధనలను సడలించం. బెయిల్‌ కాపీ మాకు అందలేదు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5.35 వరకే అందాల్సి ఉంది. బెయిల్ కాపీని సమయానికి ముందే జమానత్ బాక్స్(పెట్టెలో) వేయాలి. మెయిల్ ద్వారా పంపడం కుదరదు. జైలులో నేరుగా సమర్పించాలి. ఇప్పుడు సమయాన్ని పొడిగించలేం."

-నితిన్‌ వాచల్‌, ఆర్థర్‌ రోడ్‌ జైలు సూపరింటెండెంట్‌

'సాయంత్రం 7 గంటల వరకయినా.. విడుదలకు అవకాశం ఉంది' అని ఆర్యన్ తరఫు న్యాయవాదులు ప్రకటించిన నేపథ్యంలో జైలు అధికారి పైవిధంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు.. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆర్యన్‌ఖాన్‌కు వ్యక్తిగత పూచీకత్తును నటి జుహీ చావ్లా ఇచ్చారు. ఈ మేరకు ముంబయి ఆర్థర్​ రోడ్ జైలుకు చేరుకన్న ఆమె.. 'ఆర్యన్ త్వరలో ఇంటికి వస్తాడని.. అందుకు చాలా సంతోషంగా ఉన్నానని' పేర్కొన్నారు.

పూచికత్తు సమర్పించేందుకు వచ్చిన నటి జుహి చావ్లా
మీడియాతో మాట్లడుతున్న జుహీ చావ్లా

ఈ కేసులో ఆర్యన్​ఖాన్ సహా.. మరో ఇద్దరు నిందితులు ఆర్భాజ్‌ మర్చంట్‌, మున్‌ మున్‌ దమేచాలకు నిన్న బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. మొత్తం 14 షరతులు విధిస్తూ పూర్తి స్థాయి ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. లక్ష రూపాయల బాండ్‌తోపాటు ఒకరు లేదా ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఇవాళ ధర్మాసనం తెలిపింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆర్యన్‌ఖాన్ పాస్‌పోర్టును ప్రత్యేక కోర్టులో అప్పగించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details