ETV Bharat / bharat

'మహారాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు భాజపా కుట్ర'

author img

By

Published : Oct 29, 2021, 1:20 PM IST

డ్రగ్స్ ​కేసు.. భాజపా పన్నిన కుట్ర అని ఆరోపించారు (Nawab Malik News) మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్. మహారాష్ట్రను అప్రతిష్ఠపాల్జేసేందుకే ఇలా చేస్తోందని పేర్కొన్నారు.

nawab malik
'మహారాష్ట్రను అవమాన పరిచేందుకు భాజపా కుట్ర'

ఎన్​సీబీ జోనల్​ డైరక్టర్​ సమీర్​ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎన్​సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్ (Nawab Malik News)​.. మరోసారి విమర్శలు గుప్పించారు. వాంఖడే ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను కించ పరిచేందుకే డ్రగ్స్ ​కేసు పేరుతో (Cruise Ship Drugs Case) భాజపా కుట్ర పన్నిందని ఆరోపించారు. నోయిడాలో ఫిల్మ్​సిటీ రావాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కోరుకుంటున్నారని.. బాలీవుడ్​ను అప్రతిష్ఠపాల్జేయడం ద్వారా యూపీవుడ్​ను నిర్మించవచ్చని వారు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు.

అతడిని ఎందుకు అరెస్ట్​ చేయలేదు?

క్రూయిజ్​ షిప్​లో రేవ్​ పార్టీ (Cruise Ship Drugs Case) నిర్వహించిన కాషిఫ్ ఖాన్​ను ఎన్​సీబీ ఎందుకు అరెస్ట్​ చేయలేదని నవాబ్​ మాలిక్ ప్రశ్నించారు. కాషిఫ్..​ వాంఖడే స్నేహితుడు కావడం వల్లే అతడిని (Nawab Malik News) అరెస్ట్​ చేయలేదని ఆరోపించారు. ఆర్యన్​ ఖాన్​ను అరెస్ట్​ చేసి బెయిల్​ రానివ్వకుండా ప్రయత్నించిన వ్యక్తే ఇప్పుడు తన అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించమని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కారని.. వాంఖడేను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు నవాబ్​ మాలిక్​. కేవలం ఒక్క నెలలో పరిస్థితులు మారిపోయాయని వ్యాఖ్యానించారు.

మేము కూడా మరాఠీలమే..

'తాము మరాఠీలమని, ఓ మరాఠీగా ముఖ్యమంత్రి తమకు సాయపడాలని వారు(వాంఖడే కుటుంబసభ్యులు) సీఎంకు లేఖ రాశారు. నవాబ్​ మాలిక్​ కుటుంబం కూడా గత 70 ఏళ్లగా ఇదే పట్టణంలో ఉంటోంది. నేను 1959లో జన్మించిన నేను కూడా ముంబయి వాసినే. మరి ఇప్పుడు నవాబ్​ మాలిక్​ మరాఠీ కాదా?'

-నవాబ్​ మాలిక్, ఎన్​సీపీ నేత

ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేను సహాయం కోరుతూ సమీర్​ వాంఖడే కుటుంబీకులు లేఖ రాయడంపై మాలిక్ ఈ విధంగా​ స్పందించారు.

అందులో నిజం లేదు..

నవాబ్​ మాలిక్​ చేసిన ఆరోపణలపై వాంఖడే స్పందించారు. క్రూయిజ్​ పార్టీని నిర్వహించిన కాషిఫ్​ ఖాన్​ అనే వ్యక్తిని వాంఖడే.. అతని స్నేహితుడు కావడం వల్ల అరెస్ట్​ చేయలేదన్న​ ఆరోపణలను ఖండించారు.

ఇదీ చూడండి : 'మహిళా క్యాడెట్లకు నిష్పక్షపాతంతో స్వాగతం పలకాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.