తెలంగాణ

telangana

బాలికపై గ్యాంగ్ రేప్- సిగరెట్​తో కాల్చి.. చెట్టుకు వేలాడదీసి...

By

Published : Sep 28, 2021, 7:11 PM IST

దేశంలో మహిళలపై(crime news today) ఆఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బాలికలను కూడా విడిచిపెట్టడం లేదు(crime news india). తాజాగా.. మధ్యప్రదేశ్​లో(mp crime news) అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 15 ఏళ్ల బాలికపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఛాతిపై కాలుతున్న సిగరెట్​ను పెట్టి పైశాచికానందాన్ని పొందారు. అనంతరం ఆమెను చెట్టుకు వెలాడదీసి హత్యచేశారు.

rape
అత్యాచారం

మధ్యప్రదేశ్​ సిధి జిల్లాలో(sidhi news today) అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 15ఏళ్ల బాలికను నలుగురు సామూహిక అత్యాచారం చేసి(crime news today).. అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆమె ఛాతిపై కాలుతున్న సిగరెట్​ను రుద్ది పైశాచికానందాన్ని పొందారు. అంతటితో ఆగకుండా చెట్టుకు వేలాడదీసి ఆమె ప్రాణాలు తీశారు. జిల్లావ్యాప్తంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.(crime news india)

కిడ్నాప్​ చేసి..

సిధి జిల్లాలోని ఓ గ్రామంలో(mp crime news) సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో.. సోదరుడిని పాఠశాలలో దింపేందుకు ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లింది. తమ్ముడిని దింపిన అనంతరం వెనక్కి తిరిగివస్తుండగా.. నలుగురు ఆమెను అడ్డుకున్నారు. బలవంతం చేసి వారి బైక్​ మీద ఎక్కించుకుని అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత బాలికను చిత్రహింసలు పెట్టారు. కాలుతున్న సిగరెట్​ను ఆమె ఛాతిపై అనేకమార్లు పెట్టారు. నొప్పితో ఆ బాలిక విలవిలలాడుతుంటే చూసి.. పైశాచికానందాన్ని పొందారు. అనంతరం ఓ చెట్టుకు వెలాడదీసి ఆమె ప్రాణాలు తీశారు. అక్కడి నుంచి పరారయ్యారు.

సాయంత్రం 4 గంటల సమయంలో.. ఓ బాలిక చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మైనర్​ మృతదేహాన్ని కిందికి దింపారు. వెంటనే ఘటనపై దర్యాప్తు చేపట్టారు. హత్యాచారం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. రిపోర్టు ద్వారా మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.

ఇదీ చూడండి:-మహిళా కానిస్టేబుల్​పై సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details