తెలంగాణ

telangana

Family Suicide: శ్రీకాళహస్తిలో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

By

Published : Jun 16, 2023, 11:07 AM IST

Updated : Jun 16, 2023, 12:22 PM IST

mother suicide
mother suicide

11:00 June 16

ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో ముగ్గురి మృతదేహాలు

Family Committed Suicide: చిన్న చిన్న కలహాలు పచ్చని కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు జీవితాలకు శాపాలుగా మారుతున్నాయి. పరిష్కారం అయ్యే సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి మరణాలకు స్వాగతం పలుకుతున్నారు. వారితో పాటు అభం శుభం తెలియని చిన్నారులను సైతం చంపేస్తున్నారు. తాజాగా కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని.. శ్రీకాళహస్తి పట్టణంలోని ఈదులగుంట కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాలనీకి చెందిన శివయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం రాత్రి ఇంటికి వచ్చి భార్య శివమ్మ (30)తో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె.. ఇద్దరు పిల్లలు రోహిత్ కుమార్(3), దేవాన్ష్(09నెలలు) ఉరి వేసి తాను ఉరి వేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి రెండో పట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త శివయ్యను అదుపులోకి తీసుకున్న శ్రీకాళహస్తి పోలీసులు.. విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విజయనగరంలో ప్రేమ జంట ఆత్మహత్య:కాగా విజయనగరం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తవలస మండలం నిమ్మలపాలెం వంతెన వద్ద రైల్వే ట్రాక్‌పై ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలానికి చెందిన నందుల చంద్రన్న (32), మైనప్​ బాలికగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోనే సూసైడ్​ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Jun 16, 2023, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details