తెలంగాణ

telangana

వివాహేతర సంబంధానికి యువకుడు బలి- 150 అడుగుల లోతులో శవం- 7 రోజులు తవ్వితే..

By

Published : Feb 2, 2022, 5:38 PM IST

Updated : Feb 2, 2022, 10:12 PM IST

Mathura news: వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడ్ని ఇద్దరు స్నేహితులే హత్య చేశారు. అతడి శవాన్ని వెలికితీసేందుకు పోలీసులు జేసీబీతో 150 అడుగులు తవ్వారు. ఏడు రోజుల పాట శ్రమించి భౌతికకాయన్ని బయటకు తీశారు. యూపీ మథురలో ఈ ఘటన జరిగింది.

missing-youth-body-recovered-from-well
150 అడుగుల లోతులో శవం

youth dead body in well: ఉత్తర్​ప్రదేశ్ మథురలో 150 అడుగులు తవ్వి యువకుడి శవాన్ని వెలికితీశారు పోలీసులు. జేసీబీ సాయంతో 7 రోజుల పాటు శ్రమించి మృతదేహాన్ని కనుగొన్నారు. గతేడాది డిసెంబర్​ 23న అతడు అదృశ్యమైనట్లు చెప్పారు.

కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్​ నగర్​కు చెందిన మృతుడి పేరు వీరూ చౌదరి. ఇద్దరు స్నేహితులే అతడ్ని హత్య చేశారు. పోలీసుల విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు. జల్​ నిగమ్​ సమీపంలోని డంపింగ్​ యార్డులో ఉన్న బావిలోకి వీరూను తోసేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇటుకలు, రాళ్లు, చెత్త వేసినట్లు చెప్పారు.

150 అడుగుల లోతులో శవం

అయితే స్థానికులు మాత్రం యువకుడి మృతికి అక్రమ సంబంధమే కారణం అని చెబుతున్నారు. అందుకే స్నేహితులే అతడ్ని హత్య చేసి ఉంటారని మాట్లాడుకుంటున్నారు. పోలీసులు మాత్రం హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. విచారణ తర్వాతే అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

150 అడుగుల లోతులో శవం

డిసెంబర్​ 23న వీరూ అదృశ్యమయ్యాడు. జనవరి 15న అతని తల్లిదండ్రులు తమ కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో స్నేహితులను విచారించగా అసలు విషయం బయటపడింది.

150 అడుగుల లోతులో శవం

అయితే వీరూను బావిలో తోసేశామని స్నేహితులు చెప్పాక అక్కడికి వెళ్లి చూసిన పోలీసులు అవాక్కయ్యారు. మొత్తం రాళ్లు, చెత్తతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. దీంతో జేసీబీ సాయంతో గత బుధవారం నుంచి తవ్వడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు మంగళవారం అతడి శవాన్ని గుర్తించారు. భౌతికకాయం బాగా కుళ్లిపోవడం వల్ల హుటాహుటిన పోస్ట్​మార్టానికి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:ఆడీ కార్ ఓనర్ కిరాతకానికి శునకం బలి.. అంత్యక్రియలు చేసిన నటి

Last Updated : Feb 2, 2022, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details