తెలంగాణ

telangana

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా

By

Published : Jul 17, 2022, 4:50 PM IST

Updated : Jul 17, 2022, 5:10 PM IST

margaret alva
మార్గరెట్ అల్వా

16:49 July 17

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా(80) ఎంపికయ్యారు. ఈ మేరకు అల్వాను బరిలోకి దించనున్నట్లు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. పవార్ నివాసంలో జరిగిన భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై 17 పార్టీల నేతలు ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తామంతా ఐక్యంగానే ఉన్నట్లు శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

1942లో మంగళూరులోని రోమన్‌ కాథలిక్‌ కుటుంబంలో మార్గరెట్ జన్మించారు. గతంలో గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలు ప్రధానులుగా ఉన్న సమయంలో.. మార్గరెట్‌ కేంద్రమంత్రిగా సేవలందించారు. మార్గరెట్‌ 1974-98 వరకు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు.

Last Updated :Jul 17, 2022, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details