తెలంగాణ

telangana

భార్య ఐదో పెళ్లి- మనస్తాపంతో నాలుగో భర్త ఆత్మహత్య, సూసైడ్​ వీడియో తీసి

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 7:58 AM IST

Updated : Jan 14, 2024, 11:32 AM IST

Man Suicide For Wife 5th Marriage : మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో తన భార్య ఐదో వివాహం చేసుకుందని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజులుగా గాయాలతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Man Suicide For Wife 5th Marriage
Man Suicide For Wife 5th Marriage

Man Suicide For Wife 5th Marriage : తన భార్య ఐదో వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ భర్త తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో జరిగింది. వారం రోజుల క్రితం నిప్పంటించుకోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇంతకీ ఏం జరిగిందంటే ?
మధ్యప్రదేశ్​ ఇందోర్​కు చెందిన సునీల్​ లోహానీ అనే 35 ఏళ్ల వ్యక్తి 2018లో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అతడు ఆమెకు నాలుగో భర్త. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడటం వల్ల ఆమె గతేడాది అతడిని వదిలి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అక్కడే నివసిస్తున్న ఆమె మరో వ్యక్తిని ఐదో వివాహం చేసుకుంది. ఈ విషయం సునీల్​కు తెలియడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గత వారం ఓ సూసైడ్​ వీడియోను రికార్డు చేసి మరీ సోషల్ మీడియాలో అప్​లోడ్​ చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసుకుని తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పటికే స్థానికులు, కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయలతో వారం పాటు చికిత్స పొందిన సునీల్​, శనివారం మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సూసైడ్ వీడియోతో పాటు ఇంటి బయట రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్​ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో సునీల్​పై ఆమె వరకట్న వేధింపుల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలింది. ఈ క్రమంలోనే కోర్టు కేసుతో విసిగిపోయి, అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఐదో సారి వివాహం చేసుకున్న విషయమే ఆత్మహత్యకు కారణమా? లేక మరో కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు.

Girl Suicide Attempt Viral Video : తండ్రి తిట్టాడని బాలిక ఆత్మహత్యాయత్నం.. 'రాఖీ' సెంటిమెంట్​తో కాపాడిన ACP

బరువు తగ్గుతున్నామని మనస్తాపం- కాలువలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య!

Last Updated : Jan 14, 2024, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details