ETV Bharat / bharat

బరువు తగ్గుతున్నామని మనస్తాపం- కాలువలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 11:15 AM IST

Updated : Jan 11, 2024, 5:55 PM IST

Mother Daughter Suicide Due To Weight Loss : బరువు తగ్గుతున్నామన్న కారణంతో తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. బాధితుల ఇంట్లో ఈ మేరకు ఓ సూసైడ్ నోట్​ లభ్యమైంది. బాధితులు ప్రయాణించిన స్కూటీ ఓ కాలువ వద్ద ఉండటం వల్ల, అందులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డైవర్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు.

Mother Daughter Suicide Due To Weight Loss
Mother Daughter Suicide Due To Weight Loss

Mother Daughter Suicide Due To Weight Loss : బరువు తగ్గుతున్నామని మనస్తాపానికి గురైన తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు వారి ఇంట్లో ఓ సూసైడ్​ నోట్​ లభ్యమైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారి స్కూటీ ఓ కాలువ పక్కన ఉంది. దీంతో ఇద్దరూ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. డైవర్లను రంగంలోకి దించి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన హరియాణాలోని కర్నాల్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్నాల్​లోని సుభాష్​ కాలనీలో నివాసం ఉంటున్న మనోజ్​ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. భార్య మీను(55), మరో కుమార్తె మేఘ (28) ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే మంగళవారం మనోజ్​ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమార్తె కనిపించలేదు. దీంతో పాటు స్కూటీ కూడా లేదు. ఇద్దరూ ఏదో పనిమీద బయటకు వెళ్లి ఉంటారని భావించాడు మనోజ్​.

అర్ధరాత్రి అవుతున్నా తల్లీకూతుళ్లు ఇంటికి రాలేదు. దీంతో కాంగారు పడిన మనోజ్ ఇల్లంతా క్షుణ్ణంగా వెతకగా టేబుల్​పై ఓ నోట్ కనిపించింది. అది చూసిన మనోజ్​ దిగ్భ్రాంతికి గురయ్యాడు. బరువు తగ్గే సమస్య ఉన్నందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్​లో రాసి ఉంది. ఆ నోట్​ ప్రకారం, తల్లీకూతుళ్లు గత రెండేళ్ల నుంచి బరువు తగ్గే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య గురించి ఆస్పత్రికి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. క్రమంగా వారి శరీరం బలహీనంగా మారింది. అదే ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసింది. ఇక వారికి బరువు తగ్గడం సమస్య ఉందని బాధితుల కుటుంబ సభ్యులు కూడా తెలిపారు.

సూసైడ్​ నోట్ చూసిన మనోజ్​ ఆందోళన చెంది బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల, గాలింపు చర్యల్లో భాగంగా ఓ కాలువ పక్కన వారి స్కూటీ ఉండటం గమనించారు. అనంతరం విచారణలో ఆ స్కూటీ మనోజ్​దేనని తేలింది. దీంతో ఇద్దరూ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావించారు. అనంతరం సెర్చ్​ ఆపరేషన్​ కోసం డైవర్ల బృందాన్ని పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాలువలో కొన్ని కిలో మీటర్ల మేర గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

చెవికి చికిత్స పేరుతో జంట హత్యలు.. ఇంజెక్షన్​ ఓవర్​డోస్​తో తల్లీకూతుళ్లు బలి

గుడిసె కాలిపోయి తల్లీకూతుళ్లు సజీవ దహనం.. అధికారులే నిప్పంటించారన్న స్థానికులు

Last Updated : Jan 11, 2024, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.