తెలంగాణ

telangana

విచక్షణ మరచి.. తల్లిదండ్రులను చావబాది..

By

Published : Jun 20, 2021, 1:32 PM IST

పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించే వాడంటారు. కానీ ఏ పాపం చేశారో ఏమో.. ఫాదర్స్ డే రోజే తన ఆ తల్లిదండ్రులకు నరకం చూపించాడో సుపుత్రుడు. కర్రతో తీవ్రంగా కొట్టి, హింసించాడు. ఈ దాడిలో తల్లి మరణించగా.. తండ్రి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సదరు కొడుకు అమానుష ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

maharastra son
maharastra son

తల్లిదండ్రులను విచక్షణా రహింతంగా కొడుతున్న బాబాసాహెబ్ అనే వ్యక్తి

ఓవైపు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే పురస్కరించుకుని జన్మనిచ్చిన తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతుంటే మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోరం జరిగింది. విచక్షణ మరచిన ఓ కుమారుడు కన్నవారిపైనే రాక్షసత్వం చూపించాడు. బీడ్ జిల్లాలోని ఘాట్షిల్ పర్గావ్‌కు చెందిన బాబాసాహెబ్ ఖేద్కర్ అనే వ్యక్తి.. వృద్ధాప్యంలో ఉన్న తల్లితండ్రులను కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు.

కుమారుడి దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి శివబాయి ఖేద్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. కొడుకు అమానుష ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details