తెలంగాణ

telangana

'ఫేస్​మాస్క్'​తో హైటెక్​ కాపీయింగ్​కు యత్నం​.. చివరికి?

By

Published : Nov 21, 2021, 1:28 PM IST

హైటెక్ కాపీయింగ్​కు పాల్పడేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థి గుట్టురట్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు(maharashtra police). పోలీస్ రిక్రూట్​మెంట్ పరీక్షా కేంద్రం వద్ద నిర్వహించిన తనిఖీల్లో.. ఓ వ్యక్తి మాస్క్​లో సిమ్​కార్డ్​, మైక్, బ్యాటరీతో హాజరైనట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.

electronic face mask
మాస్క్

ఫేస్​ మాస్కులో ఎలక్ట్రానిక్ పరికరాలు

మహారాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్(maharashtra police recruitment 2021) పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ పాల్పడేందుకు యత్నించిన ఓ వ్యక్తి గుట్టు రట్టు చేశారు అధికారులు. ఓ అభ్యర్థి ధరించిన మాస్క్​లో ఎలక్ట్రానిక్ పరికరం(electronic devices in mask) ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అయితే పట్టుకునేలోపే నిందితుడు పారిపోయాడని.. ఎలక్ట్రానిక్​ ఫేస్​ మాస్కును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.

పరీక్షల్లో కాపీ కోసం ఎలక్ట్రానిక్ మాస్కు

ఇదీ జరిగింది..

పింప్రి చించ్‌వాడ్​లోని(pimpri chinchwad police) ఓ పరీక్షా కేంద్రంలో పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు ఏర్పాట్లు చేశారు అధికారులు. అభ్యర్థులను తనిఖీ చేస్తూ నిందితుడిని ఆపిన పోలీసులు.. అతని ఫేస్ మాస్క్‌లో ఎలక్ట్రానిక్ పరికరం ఉన్నట్లు గుర్తించారు. అయితే మాస్కును పరిశీలిస్తుండగానే.. అతను పారిపోయినట్లు శశికాంత్ దేవకాంత్(pimpri chinchwad police) అనే కానిస్టేబుల్ తెలిపాడు.

ఎలక్ట్రానిక్ మాస్కు మోసం

"నిందితుని ఫేస్ మాస్క్‌లో బ్యాటరీ, ఛార్జింగ్ పాయింట్, ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్, ఓ స్విచ్, మైక్ వైర్లతో అనుసంధానం అయి ఉన్నాయి."

--హింజేవాడిపోలీసులు

నిందితునిపై మహారాష్ట్ర ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్ చట్టం-1982 (maharashtra prevention of malpractices act 1982) ప్రకారం కేసు నమోదు చేశారు హింజేవాడి పోలీసులు.

ఎలక్ట్రానిక్ మాస్కు మోసం
మోసం గురించి వివరిస్తున్న పోలీసు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details