ETV Bharat / bharat

కాపీ కొట్టేందుకు 'బ్లూటూత్​ చెప్పు'లతో పరీక్ష హాలుకు!

author img

By

Published : Sep 27, 2021, 2:24 PM IST

రాజస్థాన్​లో నిర్వహించిన 'రీట్​' పరీక్షలో కొందరు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడడ్డారు. బ్లూటూత్​ ఉన్న చెప్పులు ధరించి అవకతవకలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు​ చేశారు.

రాజస్థాన్​ వార్తలు తాజా
చెప్పులో బ్లూటూత్​తో పరీక్షల్లో అక్రమాలు..

రాజస్థాన్‌లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరీక్ష (రీట్‌)లో (REET 2021) కొందరు అభ్యర్థులు 'ఆధునిక రీతి'లో అక్రమాలకు తెర లేపారు. 'బ్లూటూత్‌ అమర్చిన చెప్పులు' ధరించి (bluetooth slippers cheating) అవకతవకలకు పాల్పడ్డారు. ఈ మేరకు బీకానేర్‌లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు రీట్‌ అభ్యర్థులు కాగా మరో ఇద్దరు వారికి అతిచిన్న బ్లూటూత్‌ అమర్చిన చెప్పులను సమకూర్చారు. రూ.30వేలు విలువ చేసే ఈ చెప్పులను నిందితుడు ఒక్కో అభ్యర్థికి రూ. 6 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో సిమ్​ కార్డ్​ కూడా ఉందని పేర్కొన్నారు.

bluetooth slippers cheating
నిందితుడు
bluetooth slippers cheating
బ్లూటూత్​ అమర్చిన చెప్పు

కాగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆదివారం రీట్‌ (REET 2021) నిర్వహించారు. 16 జిల్లాల్లో మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. రాజస్థాన్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ 3,993 కేంద్రాల ద్వారా నిర్వహించిన ఈ పరీక్షలకు 16.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్నిచోట్ల అవతవకలు చోటు చేసుకున్నాయి. దౌసా, జైపుర్‌ రూరల్‌ ప్రాంతాల్లో 8 మంది 'డమ్మీ' అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. బీకానేర్‌, అజ్మేర్‌, ప్రతాప్‌గఢ్‌, సికార్‌లలో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు. మరికొన్నిచోట్ల కూడా ఇలాంటి ఉదంతాల్లో ఏడుగురిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి : డబుల్ డిగ్రీ చేసి.. వీధుల్లో 'చెత్త ఆటో' నడుపుతూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.