తెలంగాణ

telangana

Maharashtra Training Aircraft Crash : కూలిన ట్రైనింగ్​ ఎయిర్​క్రాఫ్ట్​.. ఇద్దరికి గాయాలు.. నాలుగు రోజుల్లో రెండో ఘటన!

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 10:46 AM IST

Updated : Oct 22, 2023, 11:33 AM IST

Maharashtra Training Aircraft Crash : మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఓ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్​, శిక్షకుడు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

Mharashtra Training Plane Crashes Again In Baramati Pilot Injured
Training Aircraft Crash In Maharashtra Pune

Maharashtra Training Aircraft Crash :మహారాష్ట్ర పుణె జిల్లా బారామతి తాలూకా పరిధిలోని గోజుబావి గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్​తో పాటు శిక్షకుడు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కూలిపోయిందని.. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని బారామతి ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ మోరే వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.

నాలుగు రోజుల్లో రెండో ఘటన..
ఇదిలాఉంటే ఈనెల 19వ తేదీన కూడా మహారాష్ట్రలో ఇదే తరహా ఘటన జరిగింది. బారామతిలోని కఫ్తాల్ గ్రామంలో శిక్షణ విమానం కూలి పైలట్‌ గాయపడ్డాడు. కాగా, నాలుగు రోజుల వ్యవధిలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన విమానం కూలడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అయితే గత కొద్దిరోజులుగా బారామతి, ఇందాపుర్‌లో తరచూ ఇలా ట్రైనింగ్​ ఎయిర్​క్రాఫ్ట్​లు కూలడం భయాందోళన కలిగిస్తోందని సమీప ప్రాంత ప్రజలు అంటున్నారు. అందువల్ల ఈ విషయంలో అధికారులు తక్షణమే సరైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేస్తున్నారు.

కూలిన ఎయిర్​క్రాఫ్ట్​ వద్ద స్థానికులు.

"రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్​ అకాడమీకి చెందిన ఓ శిక్షణా విమానం ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కూలిపోయింది. నీరా నది వంతెన కింద విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో పైలట్​తో పాటు శిక్షకుడు ఉన్నారు. పైలట్​కు స్వల్ప గాయలయ్యాయి. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాము. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణ జరుపుతాం."
-ప్రభాకర్ మోరే, బారామతి ఇన్‌స్పెక్టర్

పొలాల మధ్య కూలిన వాయుసేన విమానం..
కొద్దినెలల క్రితం కర్ణాటక చామరాజనగర్‌ జిల్లా భోగ్‌పూర్ సమీపంలోని పొలాల మధ్య ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విమానం గాల్లో ఉన్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు పారాచూట్ సాయంతో విమానం నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Miss Ocean World 2023 : 'సాగరకన్య'గా ముంబయి సుందరి.. 'మిస్ ఓషన్ వరల్డ్' పోటీల్లో టాప్!

Weekly Horoscope From 22nd To 28th October : ఆ రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలే లాభాలు!

Last Updated : Oct 22, 2023, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details