తెలంగాణ

telangana

"మహిళా ఉద్యోగులకు 'మూడోసారీ' ప్రసూతి సెలవులు.. కానీ..."

By

Published : May 11, 2022, 6:33 PM IST

maternity leave third child

Third Maternity Leave: మహిళా ఉద్యోగులకు మూడో సంతానానికి కూడా ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని ఆదేశించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. విడాకులు తీసుకున్న అనంతరం.. మరో పెళ్లి చేసుకొని గర్భం దాల్చిన ఉద్యోగినులు ఈ సెలవులను పొందవచ్చు.

Third Maternity Leave: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల అంశమై కీలక తీర్పు చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఉద్యోగినులు.. విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకొని గర్భం దాల్చితే.. వారికి మూడోసారి ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని ఆదేశించింది. సాధారణంగా రెండు సార్లు మాత్రమే ప్రసూతి సెలవులను అనుమతిస్తారు.

జబల్​పుర్​లో ప్రైమరీ స్కూల్​ టీచర్​గా పనిచేస్తున్న ప్రియాంక తివారీ.. విడాకులు తీసుకున్న అనంతరం మరో పెళ్లి చేసుకొని గర్భం దాల్చారు. మొదటి వివాహంలో ఆమెకు ఇదివరకే ఇద్దరు పిల్లలున్నారు. సివిల్​ సర్వీసెస్ నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగులకు రెండు సార్లు మాత్రమే ప్రసూతి సెలవులుంటాయి.

విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకొని గర్భం దాల్చిన కారణంగా తన మూడో బిడ్డ కోసం ప్రసూతి సెలవును మంజూరు చేసేవిధంగా పాఠశాల విద్యా విభాగాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రియాంక తివారీ.. హైకోర్టును ఆశ్రయించారు. మహిళ విడాకుల అనంతరం మరోసారి పెళ్లి చేసుకుంటే.. ఆమెకు రెండు సార్లకు మించి ప్రసూతి సెలవులు దక్కాలని తన పిటిషన్​లో పేర్కొన్నారు. అయితే కేసు అత్యవసర పరిస్థితి దృష్ట్యా ప్రియాంకకు మూడోసారి ప్రసూతి సెలవును మంజూరు చేయాలని పాఠశాల విద్యా విభాగాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి:వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? ఎటూ తేల్చని హైకోర్టు!

ABOUT THE AUTHOR

...view details