తెలంగాణ

telangana

నోట్లో బల్లి పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపిన పోలీస్‌!

By

Published : Jul 24, 2023, 6:56 PM IST

Lizard Enters Mouth Of Child : ఛత్తీస్​గఢ్​లోని కోర్బా జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. బల్లి నోట్లో పడి రెండున్నరేళ్ల బాలుడు మరణించాడు. ముంబయిలో జరిగిన మరో ఘటనలో భార్య సహా మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

Lizard Enters Mouth Of Child
Lizard Enters Mouth Of Child

Lizard Enters Mouth Of Child :బల్లి నోట్లో పడి రెండున్నరేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని కోర్బా జిల్లాలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణం తెలుస్తుందని చెప్పారు. అయితే, బల్లి నోట్లో పడితే మనుషులు చనిపోరంటూ జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇదీ జరిగింది
నాగిన్​భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్​కుమార్​ సందేకు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిలో చిన్నవాడైన రెండున్నరేళ్ల జగదీశ్​.. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో బెడ్​పై పడుకున్నాడు. అతడి తల్లి ఇంట్లో పనులు చేసుకుంటూ మధ్యలో వెళ్లి జగదీశ్​ను చూసేసరికి.. అతడి నోట్లో బల్లికనిపించింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి.. రోదించడం వల్ల చుట్టుపక్కల వారు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. స్థానికులు వచ్చి చూడగా.. నోట్లో ఉన్న బల్లితో పాటు జగదీశ్ కూడా మృతిచెందాడు.

"బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదు. మనిషిని చంపేంత విషం బల్లిలో ఉండదు. బల్లి నోట్లో పడడం వల్ల శ్వాశ ఆడక చనిపోయే అవకాశం ఉంది. బల్లి విషం వల్ల ఫుడ్ పాయిజన్​ లేదా కలరా వచ్చే ప్రమాదం ఉంది. కానీ బాలుడి మరణానికి గల అసలు కారణం తెలియాలంటే పోస్టుమార్టం పరీక్షల ఫలితాలు వస్తేనే తెలుస్తుంది."
-బలరాం కుర్రే, అసిస్టెంట్ ప్రొఫెసర్​, జంతుశాస్త్రం

భార్య, మేనల్లుడిని చంపిన పోలీస్‌.. ఆపై తాను ఆత్మహత్య..
ACP Killed Wife And Nephew : భార్య సహా మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో సోమవారం జరిగింది.

ఇదీ జరిగింది
అమరావతి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ACP) భరత్‌ గైక్వాడ్‌(57) బానర్‌ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న భరత్..​ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తన తుపాకీతో మొదట తన భార్య మోని గైక్వాడ్ (44) తలపై కాల్చాడు. తుపాకీ శబ్దం వినిపించడం వల్ల పక్క గదిలో ఉన్న కుమారుడు, మేనల్లుడు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత తలుపు తెరిచి చూసిన మేనల్లుడు దీపక్‌ (35)పై కూడా కాల్పులు జరిపాడు. దీపక్​ ఛాతిపై బులెట్‌ తగలడం వల్ల అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి :పామును కొరికి చంపిన బాలుడు.. వెంటనే స్పృహ తప్పి..

అత్యాచారం కేసులో అరెస్ట్​.. 'జైలు' భయంతో 'బల్లి' మింగేసిన నిందితుడు.. చివరకు..

ABOUT THE AUTHOR

...view details