తెలంగాణ

telangana

Khairatabad Ganesh Nimajjanam 2023 : బైబై గణేశా.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 1:27 PM IST

Updated : Sep 28, 2023, 2:08 PM IST

Khairatabad Ganesh Nimajjanam 2023 : వెళ్లి రావయ్యా గణపయ్య.. మళ్లీ రావయ్య గణపయ్య అంటూ.. ఖైరతాబాద్‌ మహాగణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశ్‌ నిమజ్జనం.. ఘనంగా పూర్తైంది. శోభయాత్ర ఆద్యంతం సందడిగా సాగింది. మహాగణపతికి అడుగడుగునా భక్తులు నిరాజనం పలికారు. భారీ లంబోదరుడిని హుస్సేన్‌సాగర్‌లో నిజ్జమనం చేయడంతో.. మహాఘట్టం సంపూర్ణమైంది.

Ganesh immersion 2023
Khairatabad Ganesh

Khairatabad Ganesh Nimajjanam 2023 : బైబై గణేశా.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి

Khairatabad Ganesh Nimajjanam 2023 :తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ మహాగణపతి (Khairatabad Ganesh) నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. పదిరోజులపాటు భక్తుల నీరాజనాలు అందుకున్న లంబోదరుడు.. గంగమ్మ ఒడికి చేరుకునున్నాడు. లక్ష్మీ నరసింహస్వామి, వీరభద్రుడి సమేతంగా.. శ్రీదశ విద్యా మహా గణపతిగా ఈసారి గణనాథుడు భక్తుల నీరాజనాలందుకున్నాడు. బుధవారం అర్థరాత్రి చివరిసారిగా కలశపూజ నిర్వహించిన తర్వాత.. పార్వతీ తనయుడిని టస్కర్‌పైకి చేర్చారు.

Ganesh immersion 2023: స్వామివారికి ఇరువైపులా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి, వీరభద్రుడి విగ్రహాలను ట్రాలీలపైకి చేర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తైన తర్వాత.. ఖైరతాబాద్‌ నుంచి శోభాయాత్రప్రారంభమైంది. మహాగణపతి శోభయాత్ర(Ganesh Nimajjanam) ఆద్యంతం కనుల పండువగా సాగింది. భారీ వినాయకుడిని చూసేందుకు జనం తాండోపతండాలుగా తరలివచ్చారు. దారి పొడవునా నీరాజనాలు పలికారు. శ్రీ దశవిద్యా మహాగణపతి.. సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కనుంచి.. సెక్రటేరియట్ మీదుగా సాగర తీరానికి చేరుకున్నాడు.

Balapur Ganesh Laddu Auction 2023 : బాలాపూర్ లడ్డూ వేలంపాట షురూ.. గత రికార్డు బ్రేక్ అవుతుందా..?

Ganesh immersion in Hussain Sagar 2023: ఖైరతాబాద్‌ గణేశ్‌(Khairathabad Ganesh).. హుస్సేన్‌సాగర్‌ తీరానికి చేరగానే కోలహలం అంబరాన్నంటింది. వినాయక నామ స్మరణతో సాగర తీరం మారు మోగింది. గణేశ్‌ మహరాజ్‌కి జై అంటూ భక్తులు హోరెత్తించారు. ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మహా సంద్రాన్ని తలపించే భక్త సమూహం.. పార్వతీ తనయుడిని గంగమ్మ ఒడికి చేరే వరకూ కదిలొచ్చింది.

Ganesh immersion in Telangana: దారి పొడవునా భక్తులు ఖైరతాబాద్ గణనాథుడికి నీరాజనాలు పలికారు. హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన నాలుగో క్రేన్‌ వద్ద క్రేన్ వద్ద నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశారు. టస్కర్‌పై ఏర్పాటు చేసిన వెల్డింగ్‌ను తొలగించారు. భారీ క్రేన్‌ సాయంతో.. మహగణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. వెళ్లిరా గణపయ్యా.. మళ్లీ రా గణపయ్యా అంటూ భక్తుల జయజయ ధ్వానాల చేశారు. మహాగణపతి ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరడంతో.. పోలీసులు, జీహెచ్ఎంసీ సహా వివిధ విభాగాల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Khairatabad Ganesh Nimajjanam 2023 : గణేశ్‌ నిమజ్జనాలకు పూర్తైన ఏర్పాట్లు.. రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసిన పోలీసులు

Khairatabad Ganesh Nimajjanam Complete: ఈ ఏడాది దశ మహా విద్యా గణపతి రూపంలో కొలువుదీరిన ఈ మహాగణపతి విగ్రహాన్ని మట్టితో.. 63 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పుతో రూపొందించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాన మండపం రెండు వైపులా ఇతర విగ్రహాలను ఏర్పాటు చేశారు. కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తున రూపుదిద్దుకున్నాయి. ఈ సంవత్సరం మహాగణపతిని 20 లక్షల మందికిపైగానే భక్తులు దర్శించుకున్నట్టు ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిర్వాహకులు తెలిపారు.

Balapur Laddu Auction 2023 : బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు.. ఈసారి రూ.27లక్షలు పలికిన ధర

Bandlaguda Laddu Auction 2023 : రికార్డు రిపీట్.. బండ్లగూడలో రూ.1.20 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

Last Updated : Sep 28, 2023, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details