తెలంగాణ

telangana

స్నేహితుడిపై కత్తితో దాడి.. తర్వాత రోడ్డు పక్కనే గొంతు కోసుకొని..

By

Published : Jul 12, 2022, 1:47 PM IST

Kerala Crime news: ఓ యువకుడు తన స్నేహితుడిపై కత్తితో దాడి చేసి.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డు పక్కనే గొంతు కోసుకున్నాడు. యువకుడు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

Youth stabs himself
Youth stabs himself

Kerala youth killed himself: కేరళ ఎర్నాకులంలో ఓ యువకుడు రద్దీ రోడ్డు పక్కన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొంతు నుంచి రక్తం కారుతుండగానే అదే కత్తితో చెయ్యి కోసుకున్నాడు. యువకుడు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం 6.15 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతుడిని క్రిస్టోఫర్​గా పోలీసులు గుర్తించారు.

ఆస్పత్రికి తరలించినా...
గొంతు కోసుకున్న అనంతరం కొద్దిసేపు అక్కడే కూర్చున్న అతడు.. కాసేపటికే కిందపడిపోయాడు. స్థానికులు అతడిని గమనించి.. ఆస్పత్రికి తరలించారు. అయితే, యువకుడి ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు. అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు.

గొంతు కోసుకున్న తర్వాత కూర్చున్న యువకుడు

స్నేహితుడిపై దాడి..
ఆత్మహత్యకు ముందు యువకుడు తన స్నేహితుడిపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అతడు తీవ్రంగా గాయపడ్డాడని వెల్లడించారు. ప్రస్తుతం దాడికి గురైన వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. అయితే, క్రిస్టోఫర్ ఆత్మహత్యకు, స్నేహితుడిపై దాడి చేయడానికి గల కారణాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details