ఎద్దుతో యువకుడి 'స్ట్రీట్​ ఫైట్'​.. కాలర్​ ఎగరేస్తూ భల్లాలదేవ స్టైల్​లో...

By

Published : Jul 12, 2022, 1:11 PM IST

thumbnail

బాహుబలి సినిమాలో భల్లాలదేవుడు అడవి దున్నతో ఫైట్​ చేసే సీన్​ గుర్తుంది కదూ? సరిగ్గా అలాంటి సన్నివేశాన్నే లైవ్​లో చూశారు ఛత్తీస్​గఢ్​ జగదల్​పుర్​ వాసులు. దంతేశ్వరీ ఆలయం సమీపంలో రోడ్డుపై ఓ యువకుడు.. ఇలా ఎద్దుతో ఫైట్​ చేశాడు. ఎద్దు పొడుస్తున్నా.. ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. వీరుడిలా కాలర్​ ఎగరేస్తూ ముందుకెళ్లి.. ఎద్దును లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఫైట్ ఇలా అనేక నిమిషాలపాటు సాగింది. చివరకు ఆ ఎద్దు యువకుడ్ని బలంగా ఢీకొట్టి, గాల్లోకి ఎగరేసింది. ఇక చేసేది లేక ఆ యువకుడు లేచి, కాలర్ ఎగరేసుకుంటూనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడికి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు కొందరు చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.