తెలంగాణ

telangana

బావిలో పడిన ఏనుగు.. ఇలా బయటకు...

By

Published : Jun 17, 2021, 2:03 PM IST

కేరళలో ప్రమాదవశాత్తు బావిలో పడిన ఏనుగును గంటలపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు అటవీ అధికారులు. అయితే.. గజరాజులు తరచూ ఇళ్లలోకి ప్రవేశిస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన చేశారు.

Kerala: Wild elephant rescued from well after hours of operation
బావిలో పడిన ఏనుగు.. సురుక్షితంగా బయటకు

బావిలో పడిన ఏనుగును బయటకు తీసేందుకు సహాయక చర్యలు

కేరళ ఎర్నాకుళం జిల్లా కోతమంగళం గ్రామంలో ప్రమాదవశాత్తూ బావిలో పడిన ఏనుగును అటవీశాఖ రక్షించింది. గంటలపాటు నిర్వహించిన ఈ ఆపరేషన్​లో.. అదృష్టవశాత్తూ ఏనుగుకు తీవ్ర గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

గోపాలకృష్ణన్ అనే వ్యక్తి ఇంట్లోని బావిలో ఏనుగు పడిపోయిందనే సమాచారం మేరకు అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో బావికి ఓ వైపు మట్టిని తొలగించి.. ఏనుగు పైకి ఎక్కేందుకు వీలు కల్పించారు.

నిరసన నడుమ..

గ్రామంలోకి తరచూ ప్రవేశిస్తున్న ఏనుగుల రాకపోకలను అటవీ శాఖ నిరోధించకపోవడాన్ని స్థానికులు నిలదీశారు. ఏనుగు వల్ల తనకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలనే డిమాండ్​తో ఇంటి యజమాని గోపాలకృష్ణన్ సహాయక చర్యలకు ఆటంకం కలిగించినట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:బావిలో పడిన ఏనుగు.. రోజంతా అందులోనే..

ఇదీ చదవండి:15 గంటలు శ్రమించి.. గజరాజును రక్షించి!

ABOUT THE AUTHOR

...view details