తెలంగాణ

telangana

కేరళలో మళ్లీ 20వేలు దాటిన కరోనా కేసులు

By

Published : Aug 7, 2021, 10:25 PM IST

కేరళలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,367 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 139 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 6వేల కరోనా కేసులు నమోదయ్యాయి.

corona cases in states
దేశంలో కరోనా కేసులు

కేరళలో కొవిడ్​ కేసులు శుక్రవారంతోపోలిస్తే స్వల్పంగా పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 20,367 కేసులు నమోదయ్యాయి. మరో 20,265 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 139 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35.33 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,654 మంది వైరస్​ బారిన పడి మృతిచెందారు.

మహారాష్ట్రలో కొత్తగా 6,061 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 1,610 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 32 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 36,773కు పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 72 కొవిడ్ కేసులు నమోదవగా.. మరొకరు మరణించారు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 61 మందికి కరోనా సోకినట్లు తేలగా.. వైరస్​ ధాటికి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,096 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 64 మంది మరణించారు.
  • గుజరాత్​లో 19 కేసులు నమోదు కాగా.. ఆ రాష్ట్రంలో టీకా తీసుకున్నవారి సంఖ్య 6,01,720కి చేరింది.
  • మధ్యప్రదేశ్​లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • రాజస్థాన్​లో మరో 18 మందికి కరోనా సోకినట్లు తేలింది.
  • తమిళనాడులో కొత్తగా 1,969 మందికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి మరో 29 మంది మరణించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details