తెలంగాణ

telangana

కేరళలో తగ్గని కరోనా ఉద్ధృతి- మళ్లీ 32వేల కేసులు

By

Published : Sep 2, 2021, 11:14 PM IST

కేరళలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గలేదు. కొత్తగా 32,097 కేసులు నమోదయ్యాయి. మరో 188 మంది మృతిచెందారు. 21,634 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మరోవైపు కేరళలో లక్షకు పైగా క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ తెలిపారు.

covid cases
కరోనా కేసులు

కేరళలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 32,097 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో క్రియాశీల కేసుల సంఖ్య లక్ష దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ తెలిపారు. పాజిటివిటీ రేటు 18.41శాతంగా ఉందన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లో క్రియాశీల కేసుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉంది. కేరళ నుంచి వచ్చి రాజ్యాంగపరంగా విధులు నిర్వర్తించేవారు, ఆరోగ్య సిబ్బంది, అధికారులకు క్వారంటైన్ నుంచి మినహాయింపునిస్తున్నట్టు కర్ణాటక ప్రకటించింది.

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు..

  • మహారాష్ట్రలో కొత్తగా 4,342 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 4,755 మంది కోలుకోగా.. 55మంది వైరస్​కు బలయ్యారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,240 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,252 మంది వైరస్​ను జయించగా.. 22 మృతిచెందారు.
  • తమిళనాడులో కొత్తగా 1562 కరోనా కేసులు బయటపడ్డాయి. 1684 మంది కోలుకోగా.. 20 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 754 మందికి కరోనా సోకింది. వైరస్ నుంచి కొత్తగా 666 మంది కోలుకున్నారు. మహమ్మారి ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

300 మందికి..

దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 300 మందికి డెల్టా ప్లస్ వైరస్ నిర్ధరణ అయింది. వ్యాక్సిన్​తోనే డెల్టా వేరియంట్​ను అరికట్టవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

వ్యాక్సినేషన్..

దేశంలో ఇప్పటివరకు 67 కోట్ల డోసులు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. గురువారం ఒక్కరోజే 64.70 లక్షల డోసులు ఇచ్చినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:Vaccination: 'దేశంలో 50శాతానికిపైగా వయోజనులకు కొవిడ్​ టీకా'

ABOUT THE AUTHOR

...view details