తెలంగాణ

telangana

కేరళలో 30 వేలు దాటిన కరోనా మరణాలు

By

Published : Oct 28, 2021, 7:20 PM IST

కేరళలో కొత్తగా 7,738 మందికి కరోనా(Kerala Corona Cases) సోకినట్లు తేలింది. ఒక్కరోజే ఆ రాష్ట్రంలో వైరస్ కారణంగా 708 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 30,685కు చేరింది.

Kerala Corona Cases
కేరళలో కరోనా కేసులు

కేరళలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా ఆ రాష్ట్రంలో 7,738 మంది.. వైరస్(Kerala Corona Cases) బారిన పడగా.. అనూహ్యంగా ఒక్కరోజే 708 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. అయితే.. మరణాల సంఖ్యను ఆ రాష్ట్రం సవరించడం వల్లే.. రోజువారీ మరణాల్లో ఇంతటి పెరుగుదల నమోదైంది. ఫలితంగా కేరళలో మొత్తం మృతుల సంఖ్య 30,685కు పెరిగింది. మొత్తం బాధితుల సంఖ్య 49,37,135కు చేరింది.

మరో 5,460 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 78,122కు చేరింది. కేరళలో కొత్తగా 76,043 నమూనాలను పరీక్షించారు. ఎర్నాకులం​ జిల్లాలో అత్యధికంగా 1,298 మందికి కొత్తగా వైరస్​ సోకినట్లు తేలింది. తిరువనంతపురంలో 1,089, త్రిస్సూర్​లో 836 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

దేశ రాజధాని దిల్లీలో 42 కొవిడ్​(Delhi Covid Cases Today) కేసులు బయటపడ్డాయి. వైరస్​ కారణంగా దిల్లీలో ఎవరూ చనిపోలేదు.

ఒడిశాలో కొత్తగా 412 మందికి కరోనా సోకగా.. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి:

అప్పటి వరకు దేశమంతా ఆంక్షలు: కేంద్రం కీలక ప్రకటన

దిల్లీలో 97% మందిలో కరోనా యాంటీబాడీలు!

ABOUT THE AUTHOR

...view details