తెలంగాణ

telangana

'మన సార్​ వచ్చాక కమీషన్ల వాటా పెరిగింది'.. కాంగ్రెస్​ నేతల వీడియో వైరల్!

By

Published : Oct 13, 2021, 6:06 PM IST

KPCC President
శివకుమార్ ()

ఇద్దరు సీనియర్ నేతల మధ్య సంభాషణ.. కర్ణాటక కాంగ్రెస్​ను చిక్కుల్లో పడేసింది. పీసీసీ అధ్యక్షుడు శివ కుమార్​కు, అవినీతికి ముడిపెడుతూ వారు మాట్లాడుకోవడం.. భాజపాకు విమర్శనాస్త్రంగా మారింది.

అవినీతికి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్​కు ముడిపెడుతూ ఆ పార్టీ మాజీ ఎంపీ, కేపీసీసీ మీడియా సమన్వయకర్త మాట్లాడుకున్న వీడియో ఆ పార్టీని చిక్కుల్లో పడేసింది. మంగళవారం బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించే ముందు స్టేజీపైనే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఆధారంగా చేసుకుని భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఏం మాట్లాడుకున్నారు?

మాజీ ఎంపీ వీఎస్​ ఉగ్రప్ప, కేపీసీసీ మీడియా సమన్వయకర్త సలీమ్​ మధ్య 'పర్సంటేజ్ డీల్​' గురించి ఈ సంభాషణ జరిగింది. "అంతకుముందు అది 6-8శాతం ఉండేది. డీకే శివ కుమార్ వచ్చాక దానిని 12శాతం చేశారు. మాట్లాడేటప్పుడు ఆయన కాస్త తడబడతారు. అది లో బీపీ వల్లనో, లేదంటే ఆయన తాగి ఉండడం వల్లనో నాకు తెలియదు. మీడియా కూడా అదే(ఆయన తాగారా అని) అడిగింది. కానీ.. ఆయన తాగలేదు. సిద్ధరామయ్య అలా కాదు. ఆయన బాడీ లాంగ్వేజ్ స్మార్ట్​గా ఉంటుంది. డీకేను పార్టీ అధ్యక్షుడ్ని చేసేందుకు మనందరం పోరాడాం. కానీ.. ఆయన మనల్ని, పార్టీని దెబ్బతీశారు." అని పక్కనే కూర్చున్న ఉగ్రప్పతో అన్నారు సలీమ్​. ప్రెస్​ మీట్​కు ముందు కెమెరాలు అన్నీ ఉండగానే వీరు ఇలా మాట్లాడుకున్న వీడియో వైరల్ అయింది.

ఉగ్రప్ప, సలీమ్​ల ప్రెస్​మీట్

భాజపా విమర్శలు..

సలీమ్​-ఉగ్రప్ప సంభాషణను విమర్శనాస్త్రంగా మలుచుకుంది భాజపా. "మీ సొంత పార్టీ నేతలే ప్రెస్​ మీట్​లో మిమ్మల్ని దొంగ అంటున్నారు? మీరు దొంగా? మీరు 12శాతం లంచం తీసుకుంటారా? అలా దోచుకున్న సొమ్మును పార్టీ యజమానులతో పంచుకుంటారా? దయచేసి స్పష్టత ఇస్తారా" అని శివ కుమార్​ను ఉద్దేశించి ట్వీట్ చేసింది కర్ణాటక భాజపా.
ఉగ్రప్ప వివరణ..

"ప్రెస్ మీట్​ ప్రారంభించే ముందు సాగునీటి పారుదల శాఖలో అవినీతి గురించి సలీమ్​ మాట్లాడారు. భాజపా ఇలా మాట్లాడుతోందని, మన పార్టీ నేతల్ని దోషులుగా చూపేందుకు యత్నిస్తోందని చెప్పారు. అంతేకానీ డీకే శివ కుమార్​కు వ్యతిరేకంగా మేము ఎలాంటి చర్యలకు పాల్పడలేదు. సలీమ్​ మాటల్లో స్పష్టత లేదని ఆయన్ను ఆపే ప్రయత్నం చేశాను. కాంగ్రెస్​లో పర్సంటేజీల సంప్రదాయం లేదు. దీనిని అవినీతి వ్యవహారంగా మీడియా తప్పుగా చూపిస్తోంది." అని స్పష్టం చేశారు ఉగ్రప్ప.
చాలా మంది అనుకుంటున్నట్టు కాంగ్రెస్​లో ఎలాంటి వర్గపోరు లేదని, శివ కుమార్​ చాలా మంచి నేతని కితాబిచ్చారు.

కాంగ్రెస్​ దిద్దుబాటు చర్యలు..

సలీమ్​-ఉగ్రప్ప వ్యవహారాన్ని కాంగ్రెస్​ తీవ్రంగా పరిగణించింది. సలీమ్​ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఉగ్రప్పకు షోకాజ్​ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details