తెలంగాణ

telangana

వీధి శునకాలంటే మహా ప్రేమ- 15 ఏళ్లుగా రోజూ మాంసాహారం!

By

Published : Sep 9, 2021, 2:59 PM IST

ఆ దంపతులకు సంతానం లేదు. దాంతో వీధి శునకాలపై వారు ప్రేమ పెంచుకున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాటికి మాంసాహారాన్ని అందిస్తున్నారు. అలా పదిహేనేళ్లుగా.. వాటి ఆకలి తీరుస్తున్నారు.

dog lovers
వీధి శునకాలపై దంపతుల ప్రేమ

వీధి శునకాల ఆకలి తీరుస్తున్న దంపతులు

వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నారు కర్ణాటకకు చెందిన దంపతులు. 15 ఏళ్లుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వాటికి మాంసాహారాన్ని అందిస్తూ.. వాటికి సేవ చేస్తున్నారు. ఇంతకీ ఆ దంపతులు ఎవరు? వారికి శునకాలంటే ఎందుకంత ప్రేమ(Dog Love) అంటే..?

మంగళూరుకు(Karnataka Mangalore News) చెందిన రిజర్వ్ పోలీస్​ సబ్​-ఇన్​స్పెక్టర్​ కె.పూవప్ప 32 ఏళ్ల క్రితం పోలీస్​ విభాగంలో చేరారు. రాగిణి అనే మహిళను పదిహేనేళ్ల క్రితం ఆయన పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత మంగళూరులోని పోలీస్​ క్వార్టర్​లో పూవప్ప దంపతులు నివిసిస్తున్నారు. కానీ, సంతానం కలగకపోవడం వల్ల ఈ దంపతులు ఎంతో కుమిలిపోయారు. అయితే.. ఆ తర్వాత వీధి శునకాలపై ప్రేమ పెంచకుని, వాటికి సేవ చేస్తూ.. తమ బాధను మర్చిపోతున్నారు.

శునకాలకు ఆహరాన్ని అందిస్తున్న పూవప్ప, రాగిణి దంపతులు
శునకాలకు ఆహారం అందజేస్తున్న ఎస్​ఐ పూవప్ప

రూ.15 వేలు ఖర్చైనా..

రోజూ ఉదయం, రాత్రివేళల్లో దాదాపు 27 శునకాలకు మాంసాహారాన్ని పూవప్ప, రాగిణి అందిస్తున్నారు. ఇందుకోసం వారు నెలకు రూ.15,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఒక్కరోజు కూడా ఈ దంపతులు.. శునకాలకు మాంసాహారాన్ని అందించకుండా లేరు. ఎప్పుడైనా వారు ఇంటి వద్ద లేకపోతే.. తమ సహద్యోగులను శునకాలకు ఆహారాన్ని అందించాలని, చెప్పి వెళతారు.

వీధి కుక్కల కోసం రాగిణినే స్వయంగా ఆహారం వండుతారు. ఏదైనా శునకం అనారోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తే.. వాటికి ఆహారానికి బదులు పాలు, బిస్కెట్లు అందజేస్తామని చెబుతున్నారీ దంపతులు.

ఇదీ చూడండి:గుంతలు తవ్వి.. 150 వీధి శునకాలను సజీవంగా పూడ్చి!

ఇదీ చూడండి:అక్కడి వీధి శునకాలకు అన్నపూర్ణ ఆమె!

ABOUT THE AUTHOR

...view details