తెలంగాణ

telangana

రాజకీయాలకు గుడ్​బై చెప్పిన మాజీ సీఎం.. భాజపా నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు

By

Published : Jan 4, 2023, 8:30 PM IST

Karnataka former CM SM Krishna good bye to politics
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ

కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ రాజకీయాలకు గుడ్​బై చెప్పారు. ఈ క్రమంలోనే భాజపా అగ్రనాయకత్వంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే..

క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ. తొంబైల్లో.. యాభైలా తాను ఉండలేనని అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. తాను రాజకీయాలను వీడాలనుకున్న విషయాన్ని భాజపా పెద్దగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైసూరు రహదారికి పేరు పెట్టే అంశంపై కృష్ణ స్పందించారు. దష్​పథ్ హైవేకి నల్వాడి పేరు పెట్టాలని కేంద్ర రహదారుల, జల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కోరినట్లు గుర్తు చేశారు.

"నా వయసు దృష్ట్యా రాజకీయాలను వీడాలనుకుంటున్నాను. నైంటీస్​లో ఫిఫ్టీస్​లా నేను ఉండలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందువల్లే ఈ మధ్య మీడియా సమావేశాల ద్వారా ప్రజల ముందుకు హాజరు కావట్లేదు. నేను రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని భాజపా పెద్దగా పట్టించుకోలేదు. నా రిటైర్మెంట్ తర్వాత హై కమాండ్ కనీసం పెన్షన్​ కూడా మంజూరు చేయలేదు. నేను నా వయసు రీత్యా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాను. అందుకే దీని గురించి నేను ఏం మాట్లాడలేదు" .

- ఎస్ఎమ్ కృష్ణ

ఎస్ఎమ్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక పదవులను అనుభవించారు. 2004 నుంచి 2008 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన.. తర్వాత గవర్నర్​ పదవిని చేపట్టారు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details