తెలంగాణ

telangana

'కింగ్'​ కాలేదు.. 'ప్రిన్స్' గెలవలేదు.. దేవెగౌడ ఫ్యామిలీకి తీవ్ర నిరాశ

By

Published : May 13, 2023, 4:46 PM IST

Updated : May 14, 2023, 3:51 PM IST

Karnataka Elections JDS : ఎక్కువ సీట్లు సాధించి కింగ్​ అవుదామనుకున్న జేడీఎస్​.. ప్రస్తుతం ఉన్న స్థానాలను సైతం చేజార్చుకుంది. మరోవైపు మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్​ సైతం ఓడిపోవడం వల్ల డీలా పడింది.

Karnataka Election Results 2023
Karnataka Election Results 2023

Karnataka Election Results 2023 : "కింగ్​ మేకర్ కాదు.. మా పార్టీ కింగ్ అవుతుంది. కర్ణాటకలో మేమే అధికారాన్ని చేపడతాం".. ఎన్నికలు ముగిసిన తర్వాత జేడీఎస్​ నేత, మాజీ సీఎం కుమారస్వామి చెప్పిన మాటలు ఇవి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కానీ ఆయన ఆశలు అడియాశలయ్యాయి. ఎక్కువ సీట్లు సాధించి కింగ్ మేకర్​ అవుదామనుకున్న జేడీఎస్​.. ప్రస్తుతం ఉన్న స్థానాలను సైతం చేజార్చుకుంది. పార్టీకి కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలో పట్టు కోల్పోయింది. మరోవైపు మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్​ సైతం ఓడిపోయారు.

ఓటు వేసిన కుమారస్వామి కుటుంబం

Karnataka Elections JDS : కర్ణాటకలో రాజకీయాల్లో జేడీఎస్​ది ప్రత్యేకమైన స్థానం. తక్కువ స్థానాలే గెలుచుకున్న ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. గతేడాది ఎన్నికలనే పరిశీలిస్తే.. 224 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో 37 స్థానాలు మాత్రమే గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈసారి కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషించాలని భావించింది జేడీఎస్​. 120కి పైగా సీట్లు వస్తాయని.. కర్ణాటకలో తాము అధికారం చేపడతామని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. తాము కింగ్​మేకర్​ కామని.. కింగ్​ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆయన అంచనాల తలకిందులు చేస్తూ 19 స్థానాల​కే పరిమితమైంది.

ఎన్నికల ప్రచారంలో దేవెగౌడ

జేడీఎస్​ కంచుకోటకు గండి
Old Mysore JDS : పాత మైసూరు.. జేడీఎస్​ పార్టీకి కంచుకోట భావించే ప్రాంతం. జేడీఎస్ మొత్తం​ గెలిచే స్థానాల్లో మూడింతలు ఈ ప్రాంతంలోనే గెలుచుకుంటుంది. 2013లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 40 సీట్లు గెలిస్తే.. ఓల్డ్​ మైసూరులో 28 స్థానాలు గెలుచుకుంది. 2018లో మొత్తం 37 స్థానాలు గెలిస్తే.. ఇక్కడే 31 సీట్లను సాధించింది. ఈసారి కూడా తమకు పట్టున్న ఓల్డ్​ మైసూరు ప్రాంతంలో ఎక్కువగా సీట్లు సాధించాలని భావించింది. కానీ పాత మైసూరు ఓటర్లు మాత్రం జేడీఎస్​ను తిరస్కరించి.. కాంగ్రెస్​కు పట్టం కట్టారు. తమకు ఎంతో బలంగా ఉన్న మైసూరు ప్రాంతంలో పట్టు కోల్పోయి డీలా పడింది జేడీఎస్​. 14 సీట్లకే పరిమితమైంది.

ప్రచారం చేస్తున్న కుమారస్వామి

ఓటమిపాలైన నిఖిల్​గౌడ
కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేవెగౌడ పార్టీతో పాటు కుటుంబానికి నిరాశనే మిగిల్చాయి. ఉన్న స్థానాలు కోల్పోయి.. తక్కువకే పరిమితమైన జేడీఎస్​కు.. వారసుడి ఓటమి మరో ఎదురుదెబ్బ. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్​కు మరోసారి ఓడిపోయారు. రామనగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్​ హుస్సేన్​పై 11,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అంతకుముందు 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి ఓడిపోయారు. స్వతంత్ర్య అభ్యర్థి నటి సుమలత చేతిలో 1,28,876 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు నిఖిల్.

నిఖిల్​ గౌడ
పార్టీ గెలిచిన స్థానాలు
కాంగ్రెస్​ 135
బీజేపీ 66
జేడీఎస్​ 19
ఇతరులు 4

ఇవీ చదవండి :కొంపముంచిన 'అవినీతి'.. కాపాడని హిందుత్వం.. బీజేపీ ఓటమికి కారణాలివే!

'గాలి' అడ్డాలో నారా భరత్ విజయం.. జనార్దన రెడ్డి ఫ్యామిలీలో గెలిచింది ఒక్కరే!

Last Updated : May 14, 2023, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details