తెలంగాణ

telangana

మద్యం మత్తులో కన్నతల్లినే..

By

Published : Jul 9, 2021, 10:47 PM IST

Updated : Jul 9, 2021, 11:23 PM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. డబ్బుల కోసం తన తల్లితో వాగ్వాదానికి దిగి.. అనంతరం ఆమెను హత్య చేశాడు. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో జరిగిందీ దారుణం.

son killed mother
తల్లిని చంపిన కుమారుడు

మద్యం మత్తులో పేగుబంధాన్ని మరిచి ప్రవర్తించాడు ఓ వ్యక్తి. డబ్బుల కోసం గొడవపడి కన్నతల్లినే కడతేర్చాడు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో జరిగింది.

మృతురాలు రత్నమ్మ

ఇనుప రాడ్డుతో..

మోలకల్మూ​రులో నివసించే రత్నమ్మ(45) కుమారుడు లోకేశ(22).. ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం.. డబ్బులు కావాలని తన తల్లిని వేధించాడు. వాగ్వాదానికీ దిగాడు. అయితే డబ్బులిచ్చేందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన లోకేశ.. తన తల్లిని ఇనుపరాడ్డుతో గట్టిగా మోదాడు. తీవ్రంగా గాయపడ్డ రత్నమ్మ అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

నిందితుడు లోకేశ
కుమారుడు చేతిలో గాయపడి మృతి చెందిన రత్నమ్మ

స్థానికులు ఈ విషయంపై పోలీసులకు తెలియజేయగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు లోకేశను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ జి.రాధిక తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:ఇంటికి అన్నీ తానై.. 13 ఏళ్లకే రైతుగా..

ఇదీ చూడండి:అతి చిన్న వయసులో రికార్డు 'పంచ్'​లు

Last Updated : Jul 9, 2021, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details