తెలంగాణ

telangana

"జస్టిస్ ఫర్‌ వైఎస్‌ వివేకా".. ట్విట్టర్​లో ట్రెండ్​ అవుతోన్న ట్యాగ్​

By

Published : Mar 15, 2023, 12:35 PM IST

Justice For YS Viveka

Justice For YS Viveka: ట్విట్టర్‌లో జస్టిస్‌ ఫర్‌ వైఎస్‌ వివేకా యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకి గురై నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తవుతుండగా.. వారికి న్యాయం చేయాలని నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ట్వీట్ల రూపంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Justice For YS Viveka: మాజీ మంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య జరిగి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్‌లో 'జస్టిస్‌ ఫర్‌ వైఎస్‌ వివేకా' యాష్‌ ట్యాగ్‌ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. వివేకా కుటుంబానికి న్యాయం చేయాలని నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు. జస్టిస్ ఫర్ వైఎస్‌ వివేకా ట్యాగ్‌తో వేల సంఖ్యలో నెటిజెన్లు సందేశాలను పెడుతున్నారు.

ట్విట్టర్​లో ట్రెండ్​ అవుతోన్న ట్యాగ్​

బాబాయి హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి జగన్​: వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని.. ఆ విషయం వైఎస్సార్​ జిల్లా పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రంలో ప్రతి ఇంటా తెలుసని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి.. బాబాయి హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి.. ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా అంటూ ప్రశ్నించారు. వైఎస్​ జగన్ అధికారం చేపట్టిన నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేకపోయారని.. చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంతో సహా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

నాలుగు సంవత్సరాల్లో నాలుగు కట్టుకథలు: వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపేసిన హంతకులే నాలుగు సంవత్సరాలుగా నాలుగు కట్టుకథలు వినిపించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. బాబాయ్ హత్య కేసులో సీబీఐని బెదిరిస్తూ, దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తున్న అసలు నిందితులైన అబ్బాయిలని అరెస్టు చేసి.. వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐని జగన్​ మోహన్​రెడ్డి ఎందుకు తన అధికారంతో ఇబ్బంది పెడుతున్నారన్నారని ప్రశ్నించారు. సీబీఐ అధికారి రాంసింగ్ పై ఎందుకు తప్పుడు కేసులు పెట్టించారని నిలదీశారు. వివేకా హత్య జరిగి నేటికి 4ఏళ్ల సందర్భాన్ని గుర్తు చేస్తూ నారా లోకేశ్​ ఈమేరకు ట్వీట్‌ చేశారు.

సీబీఐ అధికారులు చెప్పలేనిది.. జగన్​ ఎలా చెప్పాడు: సినిమా రిలీజ్ అవ్వకముందే కథ మొత్తం చెప్పగలిగేవాడు డైరెక్టర్ మాత్రమే కదా అంటూ వివేకా హత్యపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. 4ఏళ్లుగా విచారణ చేస్తున్న సీబీఐ కూడా వివేకా హత్య జరిగిన రోజు జగన్​ మోహన్ రెడ్డి చెప్పినంత క్లుప్తంగా చెప్పలేకపోయిందన్నారు. కానీ హత్య జరిగిన నాడే అంత వివరంగా జగన్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్​ మోహన్ రెడ్డి ప్రసంగం వీడియోను గొట్టిపాటి రవి తన ట్వీట్​కి జత చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details