తెలంగాణ

telangana

యడియూరప్ప సన్నిహితుడి ఇంట్లో ఐటీ సోదాలు

By

Published : Oct 7, 2021, 11:52 AM IST

Updated : Oct 7, 2021, 1:39 PM IST

it raids
ఐటీ సోదాలు ()

బెంగళూరులో ఐటీ సోదాలు(IT raids in Bangalore) కలకలం సృష్టించాయి. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సన్నిహితుడు సహా వ్యాపారవేత్తలు, గుత్తేదారులు, చార్టెడ్ అకౌంటెంట్ల నివాసాల్లో సోదాలు చేపట్టారు.

కర్ణాటక బెంగళూరులో ఆదాయపు పన్ను(ఐటీ) అధికారులు గురువారం విస్తృత సోదాలు(IT raids in Bangalore) చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై నగరంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు చేపట్టారు. మొత్తం 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు(IT raid today) చేశారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్‌ చేసినట్లు సమాచారం.

యడియూరప్ప సన్నిహితుడి ఇంట్లో తనిఖీలు

వ్యాపారవేత్తలు, గుత్తేదారులు, ఛార్డెట్‌ అకౌంటెంట్ల నివాసాల్లో తనిఖీలు జరుపారు అధికారులు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప సన్నిహితుడు అమిత్ ఉమేశ్‌ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు(IT raids in Bangalore) చేశారు. ఉమేశ్‌ నివాసం, కార్యాలయాలు, బంధువులకు చెందిన మొత్తం 6 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన.. అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఇరిగేషన్‌ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ల నివాసాల్లోనూ సోదాలు చేపట్టారు.

ఇదీ చూడండి:'న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు'

Last Updated :Oct 7, 2021, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details