తెలంగాణ

telangana

'పారిస్ ఒప్పందం కంటే ఎక్కువే చేస్తాం'

By

Published : Jan 26, 2021, 5:20 AM IST

పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. పారిస్ ఒప్పందంలో పేర్కొన్న అంశాల కన్నా ఎక్కువే చేస్తామని హామీ ఇచ్చారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

CLIMATE modi
మోదీ

పర్యావరణం క్షీణించకుండా చూడడంతో పాటు, దాని పరిరక్షణకు కూడా భారత్ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పర్యావరణ రక్షణ కోసం కుదిరిన పారిస్ ఒప్పందంలో పేర్కొన్న అంశాల కన్నా ఇంకా ఎక్కువే చేస్తామని చెప్పారు.

సోమవారం వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరిగిన వాతావరణ అనుసరణ సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ సదస్సును నెదర్లాండ్స్ నిర్వహించింది. 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదన ఇంధనాన్ని ఉత్పాదన చేయడంతో పాటు, ఎల్​ఈడీ బల్బులు ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తద్వారా 3.2 కోట్ల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్​ను తగ్గిస్తామని తెలిపారు.

క్షీణించిన 2.6 కోట్ల హెక్టార్ల అడవులను పునరుద్ధరిస్తామని ప్రధాని పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర శక్తి కూటమి ద్వారా ఇతర దేశాలకు సేవలు అందిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details