తెలంగాణ

telangana

'2030 నాటికి ​ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు'

By

Published : Dec 9, 2021, 5:44 PM IST

India Space Station Program: 2030 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ అంశాన్ని వెల్లడించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

isro
ఇస్రో

India Space Station Name: భారతదేశం 2030 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని శాస్త్ర, సాంకేంతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భవిష్యత్​ ప్రాజెక్టులకు సంబంధించి ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేశ అంతరిక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, స్వదేశీ స్టార్టప్‌లపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ మేరకు పలు అంశాలను వెల్లడించారు.

  • 2022లో చంద్రయాన్​ను ప్రారంభమవుతుంది.
  • 'వీనస్ మిషన్' అనే ప్రాజెక్టు సైతం ప్రతిపాదనలో ఉంది.
  • 2023లో 'ఆదిత్య సోలార్' మిషన్‌ను ఇస్రో చేపడుతుంది.
  • అంతేగాక 2022లో రెండు మానవరహిత మిషన్లను ఇస్రో ప్రయోగించనుంది.
  • 2022 చివరి నాటికి రోబో ఆధారిత మిషన్ అయిన వ్యోమమిత్రను ప్రయోగిస్తుంది. ఈ మిషన్ ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష 'గగన్‌యాన్' ప్రయోగానికి మార్గదర్శకంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.

"అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని ఇస్రో అగ్రగామిగా నిలబెడుతుంది. ప్రపంచ భాగస్వామ్యానికి చేయూతనిస్తుంది. యువత అంకుర పరిశ్రమలు స్థాపించేందుకు స్ఫూర్తినిస్తుంది. ఇప్పటికే ఈ రంగంలో సాధించిన విజయాలు మన దేశ ప్రతిభను తెలియజేస్తున్నాయి"

---డాక్టర్ జితేంద్ర సింగ్

India Space Station Mission: అంతరిక్షంలోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత వల్ల ఈ రంగంలో అనేక భాగస్వాములతో ఇస్రో కలసి పనిచేస్తోందని జితేంద్ర సింగ్ అన్నారు. ఇస్రో సహకారంతో విద్యార్థులు నానో శాటిలైట్లను అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు.

100 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి భారత్ చరిత్ర సృష్టించిందని.. వీటిలో విదేశీ ఉపగ్రహాల ప్రయోగం నుంచి 56 మిలియన్ డాలర్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details