తెలంగాణ

telangana

ఆ గ్రామంలోని కుక్కలు కోటీశ్వరులు, ఏటా భారీగా ఆదాయం, అదిరే లైఫ్​స్టైల్

By

Published : Aug 19, 2022, 5:57 PM IST

ఆ గ్రామంలోని కుక్కలు కోటీశ్వరులు. ఆశ్చర్యంగా అనిపించినా నిజం. శునకాల పేరిట ఉన్న ఆస్తుల ద్వారా ఏటా భారీగా ఆదాయమూ వస్తుంది. అందుకే రాజభోగాలు అనుభవిస్తున్నాయి ఆ కుక్కలు.

Etv Bharat
Etv Bharat

Villagers feeding to straydogs: గుజరాత్​లోని బనాస్​కాంఠా జిల్లా పాలన్‌పూర్ తాలూకా కుశాకల్ గ్రామ ప్రజలు వీధికుక్కల కోసం ఏకంగా 20 బీఘాల భూమిని కేటాయించారు. ఒక్క బీఘా భూమి విలువ సుమారు రూ.25 లక్షలు. అంటే మొత్తం విలువ దాదాపు రూ.5 కోట్లు ఉండొచ్చు. ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని శునకాల కోసమే ఖర్చు చేస్తారు. ఏడాది పొడవునా వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తుంటారు.

ఈ గ్రామంలో సుమారు 600 ఇళ్లు ఉన్నాయి. అత్యధిక కుటుంబాలు వ్యవసాయం, పశు సంరక్షణ మీద ఆధారపడినవే. ఎన్నో సంవత్సరాల క్రితం నవాబులు పాలిస్తున్న సమయంలో వ్యవసాయం కోసం గ్రామస్థులకు ఇచ్చిన భూమిని వారు వీధికుక్కల కోసం కేటాయించారు. ఆ భూమిని అంతా కలిసి సాగు చేస్తారు. పండిన పంట మొత్తాన్ని కుక్కల కోసమే పక్కన పెడతారు. పండుగల సమయంలో శునకాల కోసం మిఠాయిలు, ఇతర ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. ఇందుకోసం గ్రామంలోని ప్రజలందరూ ఏకమౌతారు. కుక్కలకు ఆహారం తయారు చేసేందుకు గ్రామస్థులు పెద్ద పెద్ద పాత్రలను కొనుగోలు చేశారంటే వాటికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

"మా గ్రామంలో కుక్కలను సేవ చేసే సంప్రదాయం మా పూర్వీకుల కాలం నుంచి వస్తోంది. ఈ గ్రామంలోని 20 బీఘాల భూమిలో ఎంత లాభం వచ్చినా శునకాల పెంపకానికి వినియోగిస్తాము".

- ప్రకాశ్​ చౌదరి, గ్రామస్థుడు.

"మా గ్రామంలోని కుటుంబాలన్నీ వీధికుక్కలకు ఆహారం వండి, వడ్డించే ఆనవాయితీని పాటిస్తున్నాయి. కుక్కల కోసం రోజూ 10 కిలోల పిండితో రొట్టెలు తయారు చేస్తారు" అని తెలిపారు కుశాకల్ గ్రామానికి చెందిన హితేశ్ చౌదరి.

ఇదీ చదవండీ:

కత్తి విన్యాసాలతో గిన్నిస్​ రికార్డ్​, ఒకే చోట వేలాది మంది కలిసి

యాపిల్‌ యూజర్లకు బిగ్​ అలర్ట్, వెంటనే అప్డేట్​ చేసుకోండి లేకుంటే

ABOUT THE AUTHOR

...view details