తెలంగాణ

telangana

సంక్రాంతికి ఊరెళ్తున్నారా - ఇళ్లు గుల్లవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 9:31 AM IST

Hyderabad Police Suggestions Sankranti Festival 2024 : సంక్రాంతికి ఇంటికి తాళమేసి ఊరెళ్తున్నారా ఐతే, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతేడాది జరిగిన చోరీలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. పండక్కి హైదరాబాద్‌ నుంచి చాలా మంది తమ స్వస్థలాలకు వెళుతుంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. దొంగతనాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడిస్తున్న పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

Thefts in Hyderabad During Sankranthi Festival
Thefts in Hyderabad During Sankranthi Festival

సంక్రాతికి ఊరెళ్తున్నాారా? అయితే తస్మాత్​ జాగ్రత్త

Hyderabad Police Suggestions Sankranti Festival 2024 :తెలంగాణలోసంక్రాంతి పండుగ (Sankranti Festival 2024) కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు నగరాల నుంచి స్వస్థలాలకు వెళతారు. ఇదే సమయంలో అంతరాష్ట్ర దొంగల ముఠాలు హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. గతేడాది పదుల సంఖ్యలో చోరీలు జరగటంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పండుగ సమయాల్లో దొంగతనాల నియంత్రణకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతేడాది జరిగిన ఘటనలపై అధ్యయనం చేసి ఆయా ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించారు. మరోవైపు ఊళ్లకు వెళ్లేవారికి తగిన జాగ్రత్తలు సూచిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు

Thefts in Hyderabad During Dussehra : పండక్కి ఊరెళ్తున్నారా.. దొంగలు ఊడ్చేస్తారు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Telangana Police Caution Against Thefts In Festival Season : :హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను అమర్చిన పోలీసులు కాలనీలు, ఇళ్లు, దుకాణ సముదాయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీ ఇంటిని గమనించమని చెప్పడం మంచిదని చెబుతున్నారు. తాళం వేసిన తర్వాత కనపడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలని ఇంటి ముందు పాలప్యాకెట్లు, వార్తాపత్రికలు జమ కానివ్వకుండా చూడాలని హెచ్చరిస్తున్నారు. విలువైన వస్తువుల సమాచారాన్ని, ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

"ఇంట్లో బంగారం ఉన్న విషయం ఎవరికి చెప్పవద్దు. ఖరీదైనా ఆభరణాలు లాకర్​లో డిపాజిట్​ చేయాలి. ఇంటిని తాళం వేసినప్పుడు కర్టన్​ వేయాలి. చుట్టుపక్కల ఉండే వారికి ఇళ్లు చూడమని చెప్పాలి. అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వమని తెలియజేయాలి. లేనిచో డయల్​ 100కి కాల్​ చేయాలి. స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి." -శివ భాస్కర్, ఏసీపీ కూకట్‌పల్లి

Home Safety Measures By Police Department : సెలవులకు వేరే ఊరు వెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!

Sankranti Precautions 2024 :ప్రజలు సమన్వయంతో సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమని పోలీసులు వెల్లడిస్తున్నారు. పోలీస్​స్టేషన్‌ నెంబర్‌, విధులకు వచ్చే బీట్‌ కానిస్టేబుల్‌ నంబర్ దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకోక పోవటమే మేలని తెలిపారు. కాలనీల్లో కమిటీలు వేసుకొని వాచ్‌మెన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయా కమిటీ సభ్యులు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్‌ 100లేదా స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని కోరుతున్నారు.

"కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీ ఇంటిని గమనించమని చెప్పడం మంచిది. తాళం వేసిన తర్వాత కనపడకుండా డోర్​ కర్టెన్​ వేయాలి. ఇంటి ముందు పాలప్యాకెట్లు, వార్తా పత్రికలు జమ కానివ్వకుండా చూడాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. బయటకు వెళ్లే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకోవద్దు. కాలనీలో కమిటీలు వేసుకొని వాచ్​మెన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్​ 100 కి సమాచారమివ్వండి." - శివ భాస్కర్​, ఏసీపీ కూకట్​ పల్లి

How To Book Entire Coach In Train : ఫ్యామిలీతో టూర్ వెళ్తున్నారా?.. తక్కువ ధరకే మొత్తం కోచ్​నే బుక్ చేసుకోండిలా!

సంక్రాంతి సందడి షురూ - నెలన్నర ముందే రైలు టికెట్ల బుకింగ్

ABOUT THE AUTHOR

...view details