తెలంగాణ

telangana

Horoscope Today (04-12-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

By

Published : Dec 4, 2021, 5:18 AM IST

ఈ రోజు రాశిఫలాల (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
రాశి ఫలాలు

ఈరోజు (04-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;బహుళపక్షం

అమావాస్య: మ.1.49 తదుపరి మార్గశిర శుక్లపక్ష పాడ్యమి అనూరాధ: ఉ. 11.54 తదుపరి జ్యేష్ఠ

వర్జ్యం: సా. 5.04 నుంచి 6.33 వరకు

అమృత ఘడియలు: రా.1.57 నుంచి 3.26 వరకు

దుర్ముహూర్తం: ఉ. 6.19 నుంచి 7.47 వరకు

రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు

సూర్యోదయం: ఉ.6.19, సూర్యాస్తమయం: సా.5-20

మేషం

మంచి ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో బాగా రాణిస్తారు. శ్రద్ధతో పనిచేయండి. కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. గతంలో పూర్తికాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. తోటివారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. ఉన్నతాధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్నిస్తాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. సూర్య ఆరాధన ఉత్తమం.

వృషభం

చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత ఉంది. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. నిబద్ధతతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం పరిరక్షణ అవసరం. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

మిథునం

విశేష ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. నిర్మలమైన మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్నిస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. బంధు ప్రీతి కలదు. అపోహలకు తావివ్వకండి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదేవతారాధన శుభదాయకం.

కర్కాటకం

ఉద్యోగపరంగా మిశ్రమ కాలం. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. తలపెట్టిన పనుల్లో ఓర్పు చాలా అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించండి. మీ మీ రంగాల్లో పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. ప్రశాంతంగా సమాధానమివ్వండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనతో సమస్యలు తగ్గుతాయి. నవగ్రహ ధ్యానం మంచిది.

సింహం

అనుకున్నది సాధిస్తారు. మంచి ఫలితాలున్నాయి. ఏకాగ్రతతో పనిచేసి గొప్ప ఫలితాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. అదృష్టప్రాప్తి ఉంది. మంచి సౌఖ్యం కలదు. నూతన వస్తువులు కొంటారు. తోటివారికి సహాయపడతారు. చెప్పుడు మాటలు విని ఇబ్బందిపడతారు. అయినవారితో విభేదించవద్దు. నిర్మలమైన మనస్సుతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. మనోబలం శక్తినిస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

కన్య

మొదలుపెట్టిన పనులను నిశితంగా ఆలోచించి ముందుకు సాగండి. ఇబ్బందులను అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అవగాహనతో ముందుకు సాగండి. ఊహించిన ఫలితాలను పొందుతారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. దుర్గాదేవి స్తోత్రం చదవాలి.

తుల

శుభ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధిపథంలో ముందుకు సాగుతారు. మీ మీ రంగాల్లో గొప్ప ఫలితాలను పొందుతారు. అదృష్టవంతమైన కాలం నడుస్తోంది. చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాన్నిస్తాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతారాధన శుభదాయకం.

వృశ్చికం

మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగితే విజయం తథ్యం. గమ్యాన్ని చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారంలో చిరునవ్వుతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. కీలక విషయాల్లో దగ్గరివారి సహకారం అందుతుంది. ఎవ్వరితోనూ విభేదించవద్దు. తగాదాలకు దూరంగా ఉండాలి. శత్రువులతో జాగ్రత్త. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారాంతంలో అనుకూల ఫలితాలున్నాయి. ఇష్టదైవారాధన శ్రేయోదాయకం.

ధనుస్సు

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన సహాయం అందుతుంది. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మీ మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మిత్రుల సలహాలు మంచి చేస్తాయి. కీలక సమయాల్లో ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయవద్దు. ఒక వ్యవహారంలో మాటపడాల్సి వస్తుంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.

మకరం

ఉద్యోగ లక్ష్యాలను చేరుకుంటారు. అదృష్ట సిద్ధి ఉంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవబలంతో అనుకున్నది దక్కుతుంది. మీలోని చిత్తశుద్ధి మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆత్మీయులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీ స్వధర్మం సదా రక్షిస్తుంది. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. కలహాలకు తావివ్వకండి. జ్ఞానం వృద్ధిచెందుతుంది. సమాజంలో కీర్తి లభిస్తుంది. ఇష్టదేవతారాధన మంచిది.

కుంభం

శుభ ఫలితం ఉంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. చేసే పనిలో నైపుణ్యం చాలా అవసరం. పట్టు వదలకుండా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉంటూ, మనల్ని ఇబ్బందిపెట్టేవారున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆర్థికంగా శుభకాలం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతారాధన ఉత్తమ ఫలితాలనిస్తుంది.

మీనం

మనోబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మేలైన ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. కీలక విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తప్పుదోవ పట్టించేవారున్నారు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయవద్దు. శత్రువులకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో ముందుచూపు అవసరం. ఇష్టదేవతా స్తుతి శుభదాయకం.

ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (నవంబర్​ 28 - డిసెంబర్​ 04)

ABOUT THE AUTHOR

...view details