ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (నవంబర్​ 28 - డిసెంబర్​ 04)

author img

By

Published : Nov 28, 2021, 6:41 AM IST

ఈ వారం (నవంబర్​ 28 - డిసెంబర్​ 04) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

రాశిఫలం
horoscope

ఈ వారం (నవంబర్​ 28 - డిసెంబర్​ 04) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు..

మేషం..

అదృష్ట ఫలాలు అందుతాయి. అవసరాలకు ధనం సమకూరుతుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కాలహరణం చేసేవారుంటారు. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. వ్యాపారరీత్యా మిశ్రమ ఫలాలు ఉంటాయి. చంచలత్వం పనికిరాదు. కుటుంబసభ్యుల సలహాలు అవసరం. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

వృషభం..

మనోధైర్యంతో పని ప్రారంభించండి. కార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ప్రతి పనీ ఆలోచించి చేయండి. పరిస్థితులు అనుకూలంగా లేవు. జాగ్రత్తగా లక్ష్యాన్ని పూర్తిచేయాలి. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. బంధుమిత్రుల అండ లభిస్తుంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.

మిథునం..

ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. వ్యాపార లాభాలుంటాయి. కార్యసిద్ధి ఉంది, మానవప్రయత్నం అవసరం. ఆశయాలు నెరవేరతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓర్పుతో పనిచేస్తే మంచి జీవితం లభిస్తుంది. దైవబలం రక్షిస్తుంది. నూతన వస్తులాభం సూచితం. భూ- గృహ- వాహనాది ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టదేవతాస్మరణ మంచిది.

కర్కాటకం..

ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. అనేక అవరోధాలు ఎదురవుతాయి. చాకచక్యంగా వాటిని అధిగమించండి. తెలియని ఒత్తిడి కలుగుతుంది. ఉద్యోగంలో సకాలంలో పని ప్రారంభించండి. సత్ఫలితముంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. సమయస్ఫూర్తి రక్షిస్తుంది. మిత్రుల సహకారం అవసరం. నవగ్రహ శ్లోకాలు చదవండి, కుటుంబపరంగా మేలు జరుగుతుంది.

సింహం..

అద్భుతమైన శుభకాలం. అనేక విధాలుగా పైకి వస్తారు. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. వ్యాపార లాభముంటుంది. ధైర్యంగా ముందుకెళ్లండి. ఎటుచూసినా కార్యసిద్ధి గోచరిస్తోంది. పదిమందికీ మేలు చేస్తారు. వస్తు వాహనాది యోగాలు ఉన్నాయి. శత్రుదోషం తొలగుతుంది. లక్ష్మీదర్శనంతో ప్రశాంతత లభిస్తుంది.

కన్య..

ముఖ్యకార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగం అనుకూలం. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తిచేయాలి. తగినంత గుర్తింపు లభిస్తుంది. ముక్కుసూటితనం పనికిరాదు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడాలి. దుర్గాదేవిని ధ్యానించండి, అంతా శుభమే జరుగుతుంది.

తుల..

నిర్మలమైన మనసుతో పనులు మొదలుపెట్టండి. అద్భుతమైన ఫలితం సొంత మవుతుంది. ఉద్యోగ భవిష్యత్తు శుభప్రదం. వ్యాపారంలో విశేషమైన అభివృద్ధి గోచరిస్తోంది. ముఖ్యవ్యక్తుల పరిచయం శక్తినిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. కల సాకారమవుతుంది. విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శుభవార్త వింటారు.

వృశ్చికం..

మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. స్వల్ప అవరోధాలున్నా అంతిమంగా కార్యసిద్ధి లభిస్తుంది. కృషి బాగా అవసరం. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. తోటివారి సలహాతో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కష్టపడాలి. వారాంతంలో శుభవార్త ఆనందాన్నిస్తుంది. సూర్యస్తుతి మంచిది.

ధనస్సు..

విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సంకల్పం సిద్ధిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువర్గం నుంచి తగినంత ప్రోత్సాహముంటుంది. గృహయోగం ఉంది. వ్యాపారంలో ఎవరినీ నమ్మవద్దు. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్టదేవతను దర్శించండి, శాంతి లభిస్తుంది.

మకరం..

ఉద్యోగయోగం బాగుంది. శ్రమనుబట్టి ఫలితముంటుంది. కార్యసిద్ధి సంతృప్తినిఇస్తుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ప్రతి పనీ ఇంట్లో వారికి చెప్పి చేయండి. ఎవరితోనూ విభేదించవద్దు. ఆస్తిని వృద్ధి చేస్తారు. మిత్రులతో కలిసి చేసే పనులు శక్తినిస్తాయి. విశ్రాంతి అవసరం. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మేలు.

కుంభం..

అద్భుతమైన విజయం లభిస్తుంది. చిత్తశుద్ధితో బాధ్యతలను నిర్వహించండి. ఉద్యోగం చాలా బాగుంటుంది. పెద్దలతో సయోధ్య కుదురుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. స్వయంకృషితో పైకి వస్తారు. పదిమందికి సాయపడతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఇష్టదేవతాస్మరణ మంచిది.

మీనం..

మనోబలంతో పనిచేయండి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ముందూ వెనుకా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. కొందరివల్ల మనశ్శాంతి తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. వారం మధ్య మంచి విజయం లభిస్తుంది. ప్రతిభతో పెద్దలు ప్రసన్నులవుతారు. శుభవార్త వింటారు. ఇష్టదేవతారాధనతో శాంతి లభిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.