తెలంగాణ

telangana

పాలపొంగులా సిమ్లా.. హిమసోయగాల్లో రైలు ప్రయాణం మధురజ్ఞాపకం!

By

Published : Feb 6, 2022, 2:58 PM IST

Heritage trains in India: మంచు దుప్పటి కప్పుకున్న ఎత్తైన కొండలను ఎటువైపు చూసినా ధవళవర్ణంలో మిళమిళలాడే హిమ అందాలను, ఒంపులు తిరిగిన రోడ్ల గుండా రైలులో ప్రయాణిస్తూ చూడడం ఓ మధురానుభూతి. ఆ ప్రకృతి రమణీయతకు ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఈ రమణీయమైన ప్రకృతి అందాలను వీక్షించాలంటే సిమ్లాకు వెళ్లాల్సిందే. కరోనా ఆంక్షల సడలింపుతో క్రమంగా హిమాచల్‌ప్రదేశ్‌కు పర్యటకుల రాక పెరుగుతోంది.

Heritage trains
హిమపాతం

సిమ్లాలో భారీ హిమపాతం

Heritage trains in India: ప్రకృతి తన అందాలను ఆరబోసిన ప్రదేశం సిమ్లా. ఎటు చూసినా హిమవర్ణం, ఎత్తైన కొండలు.. పచ్చని పైన్ అడవులు, జలపాతాలు, లోయలతో సిమ్లా ప్రకృతి రమణీయతకు నిదర్శనంలా నిలుస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. కొండకోనల గుండా సాగే రైలు ప్రయాణంలో మంచుతో సింగారించుకున్న అందాలను చూసి మధురానుభూతి పొందుతున్నారు.

సిమ్లా రైల్వే స్టేషన్​లో మంచు

హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చిన పర్యాటకులకు రైలు ప్రయాణం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలి పోతుంది. హెరిటేజ్ ట్రాక్ అందాలను చూడటానికి.. పర్యాటకులు రైళ్లలో ప్రయాణిస్తారు. దేవదార్ చెట్లు, పర్వతాల మధ్య నిర్మించిన ట్రాక్‌లో ప్రయాణించడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రైలు ప్రయాణం 102 సొరంగాల గుండా సాగుతుంది. క్వీన్ ఆఫ్ హిల్స్‌గా గుర్తింపు పొందిన సిమ్లాలో.. కొండల మధ్య రైలులో, ధవళవర్ణంతో మెరిసిపోతున్న పరిసరాలను చూస్తూ ముందుకు సాగడం అద్భుతంగా ఉంటుంది.

హెరిటేజ్​ రైలు

సిమ్లాలో ఇప్పుడు మంచు భారీగా పేరుకుపోయింది. చుట్టూ హిమవర్ణమే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో హెరిటేజ్ రైళ్లు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కల్కా- సిమ్లా రైల్వే లైన్‌లో ప్రయాణం కొత్త అనుభూతిని ఇస్తుంది. 103 సొరంగాలను దాటుకొని.. 87 వంతెనలెక్కి.. 900 మలుపులు తిరిగి.. 20 స్టేషన్లలో ఆగి.. ఈ రైలు గమ్యానికి చేరుకుంటుంది. కల్కా-సిమ్లా మార్గంలో అన్ని రైళ్లను నడుపుతున్నామన్న రైల్వే అధికారులు.. 80 శాతం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రతిరోజూ వస్తున్నారని తెలిపారు.

హెరిటేజ్​ రైలు

ఇదీ చూడండి:'ఎలిఫెంట్ పార్టీ' అదుర్స్​.. బేబీ ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు

ABOUT THE AUTHOR

...view details