తెలంగాణ

telangana

ప్రికాషన్‌ డోసు కాల వ్యవధిపై కేంద్రం క్లారిటీ

By

Published : Apr 30, 2022, 12:52 PM IST

కరోనా టీకా డోసుల కాలవ్యవధిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రెండు డోసు తర్వాత ప్రికాషన్‌ డోసు తీసుకునే కాల వ్యవధిని తగ్గించలేదని వెల్లడించింది. ప్రికాషన్‌ డోసుకు కాల వ్యవధి 9 నెలలే అని స్పష్టం చేసింది.

vaccine
వ్యాక్సిన్​

కరోనా టీకాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రెండు డోసు తర్వాత ప్రికాషన్‌ డోసు తీసుకునే కాల వ్యవధిని తగ్గించలేదని వెల్లడించింది. ప్రికాషన్‌ డోసుకు కాల వ్యవధి 9 నెలలే అని స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ఈ ఏడాది ఆరంభంలో ప్రికాషన్‌ డోసు పంపిణీని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు డోసు తీసుకున్న తర్వాత 9 నెలలకు ప్రికాషన్‌ డోసు తీసుకోవాలని వెల్లడించింది. అయితే ఈ కాల వ్యవధిని 6 నెలలకు తగ్గించాలంటూ గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రికాషన్‌ డోసు కాలవ్యవధిని కేంద్రం తగ్గించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు నేడు స్పందించాయి. కాల వ్యవధిని తగ్గించలేదని, రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతే ముందు జాగ్రత్త డోసు వేయించుకోవాలని మరోసారి స్పష్టం చేశాయి.

జనవరి 10 నుంచి దేశంలో మూడో డోసు పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ప్రికాషన్‌ డోసు అందించారు. అయితే ఏప్రిల్‌ 10 నుంచి 18 ఏళ్ల పైబడిన అందరూ ప్రికాషన్‌ డోసు వేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కాగా.. ప్రైవేటు కేంద్రాల ద్వారా ఈ డోసును పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చదవండి: న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్ రమణ

ABOUT THE AUTHOR

...view details