తెలంగాణ

telangana

Omicron variant: 'ఒమిక్రాన్'​తో భయాలొద్దు.. ఈ గుడ్​న్యూస్​ చూడండి!

By

Published : Dec 1, 2021, 5:11 PM IST

Updated : Dec 1, 2021, 6:06 PM IST

Omicron virus India: ఒమిక్రాన్​తో భారతీయులకు ముప్పు తక్కువేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్​ను ఎండెమిక్ దశకు ఆవిర్భావంగా భావిస్తున్నారు. ఇది సాధారణ వ్యాధిలా మారిపోతుందని అంటున్నారు. బూస్టర్ డోసుతో ఒమిక్రాన్​కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.

good news about omicron
good news about omicron

Omicron positive news: ప్రపంచాన్ని కొవిడ్ భూతం పట్టిపీడిస్తోంది. కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఒమిక్రాన్‌ వల్ల తీవ్రస్థాయి వ్యాధికి పెద్దగా ఆస్కారం లేదని ఆఫ్రికా నుంచి వస్తున్న వార్తలను బట్టి ప్రాథమికంగా స్పష్టమవుతోంది. కానీ, దీనికి సంబంధించిన డేటా చాలా పరిమితంగానే ఉన్నందువల్ల అప్రమత్తత కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.

Omicron good new: అయితే, ఒమిక్రాన్​తో పలు సానుకూల అంశాలు సైతం కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్​ను కరోనా ఎండెమిక్ దశకు ఆవిర్భావంగా కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మహమ్మారి దశను దాటుకొని సాధారణ వ్యాధిలా ఇది మారిపోతుందని అంటున్నారు. ప్రమాదకరమైన మహమ్మారి దశతో పోలిస్తే ఎండెమిక్​లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందన్నది చెబుతున్నారు.

Indians safe from Omicron:

భారతీయులకు ముప్పు తక్కువే.

అంతేకాకుండా, ఒమిక్రాన్​తో భారతీయులకు ముప్పు తక్కువేనని ఆరోగ్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భారతీయులు.. ఒమిక్రాన్ సహా ఇతర కొవిడ్ వేరియంట్ల నుంచి రక్షణ పొందారంటున్న నిపుణులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొవిడ్ అంశంలో ఏర్పాటైన కన్సార్టియం ఇన్‌సాకాగ్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్ షాహిద్ జమీల్ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు..

జమీల్ వివరించిన ప్రకారం..

  • వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో వేగం పుంజుకోని సమయంలోనే సుమారు 93 నుంచి 94 కోట్ల మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి.
  • ఇటీవల నిర్వహించిన సెరో సర్వేలో దిల్లీలో 97 శాతం, ముంబయిలో 85 నుంచి 90 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది.
  • వీటన్నింటిని విశ్లేషిస్తే.. ఇప్పటికే దేశ జనాభాలో చాలామందికి ఒమిక్రాన్ సహా ఇతర వేరియంట్ల నుంచి రక్షణ లభించినట్లు తెలుస్తోంది.

antibodies against omicron:

ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు యాంటీబాడీలే రక్ష అని చెప్పారు జమీల్. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు భయపడాల్సిన పనిలేదన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Omicron booster vaccine:

బూస్టర్​తో చెక్

మరోవైపు, బూస్టర్ డోసుతో ఒమిక్రాన్​ను అడ్డుకోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ టీ జేకబ్ జాన్ తెలిపారు. ఒమిక్రాన్ వల్ల మూడో దశ వ్యాప్తి సంభవించే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ ఇన్ఫెక్షన్ రావడం సహజమేనని అన్నారు. కొత్త వేరియంట్ తలెత్తినప్పుడు ఇలా జరుగుతుందని తెలిపారు. తొలి, రెండో దశ కరోనా వ్యాప్తి సమయంలోనే దేశంలోని మెజార్టీ ప్రజలు రోగనిరోధక సాధించారని చెప్పారు.

"తొలి దశ సమయంలో దేశంలోని 30 శాతం మందికి కొవిడ్ సోకింది. రెండో వేవ్​లో 12 వారాల్లోనే మిగిలిన జనాభాలో 75-80 శాతం మందికి వైరస్ వ్యాపించింది. ఇందులో రీఇన్​ఫెక్షన్లు కూడా ఉంటాయి. కాబట్టి, ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తే ఏం జరుగుతుందో తెలియదు. ప్రజలు భయపడుతున్నట్టుగా ఏం జరగకపోవచ్చు. థర్డ్ వేవ్ రాకపోవచ్చు. అయితే, ప్రతికూల పరిస్థితులకు అయితే సిద్ధంగా ఉండాలి. హెర్డ్ ఇమ్యూనిటీని పెంచేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం వ్యాక్సినేషన్ పూర్తికాని వారికి వెంటనే టీకాలు ఇవ్వాలి. పూర్తైన వారికి బూస్టర్ డోసులు అందించాలి. చిన్నారులకూ తొలి డోసు ఇవ్వడం ప్రారంభించాలి. తొలిసారి గర్భం దాల్చిన మహిళలకు రెండు డోసులు అందించాలి. రెండో ప్రెగ్నెన్సీలో ఉన్నవారికి బూస్టర్ డోసూ కూడా ఇవ్వాలి."

-టీ జేకబ్ జాన్, వైరాలజిస్ట్

ఆఫ్రికాలో ఒమిక్రాన్‌ ఎందుకు అంత తీవ్రంగా వ్యాపిస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇతర రకాలతో పోలిస్తే ఈ వేరియంట్‌ వల్ల అధిక వైరల్‌ లోడు ఉంటుందా అన్నది ఇంకా తేలలేదు. వైరస్‌ వ్యాప్తి అనేది సంక్లిష్టమైన, బహుళ అంచెల ప్రక్రియ. ఒమిక్రాన్‌కు అధిక వ్యాప్తిరేటు ఉండటానికి అనేక కారణాలు దోహదపడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వేరియంట్‌ వల్ల కలిగే వైరల్‌ లోడు, ప్రస్తుత టీకాలు లేదా గతంలో వచ్చిన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వెలువడిన రోగ నిరోధక స్పందనను అది ఎంత వరకూ ఏమారుస్తుందన్నది నిర్ధరించాల్సి ఉంది.

కనిష్ఠ స్థాయికి కేసులు..

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుతుండటం కూడా ఆశాజనకమైన పరిణామంగా కనిపిస్తోంది. గతేడాది మే తర్వాత నెలవారీ కేసుల సంఖ్య నవంబర్​లోనే అతి తక్కువగా నమోదైంది. నవంబర్​లో దాదాపు 3.1 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వరుసగా ఆరో నెలలోనూ కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం.

మే 6న దేశవ్యాప్తంగా 4,14,188 కేసులు బయటపడ్డాయి. ఒకరోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఆ తర్వాతి నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 547 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష లోపునకు పడిపోయింది. 54 రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య 20 వేల లోపే నమోదవుతున్నాయి.

ఇదీ చదవండి:

Last Updated :Dec 1, 2021, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details