తెలంగాణ

telangana

స్వలింగ సంపర్కుడి కిరాతకం.. తనను వదిలి వెళ్లిపోతున్నాడని యువకుడి దారుణ హత్య

By

Published : Apr 13, 2023, 9:34 AM IST

Updated : Apr 13, 2023, 11:19 AM IST

తనని విడిచి ఉద్యోగం కోసం వేరే ప్రదేశానికి వెళ్లిపోతున్నాడనే కారణంతో తోటి స్వలింగ సంపర్కుడిని హత్య చేశాడు ఓ యువకుడు. ఈ దారుణం బంగాల్​లో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

gay-killed-his-partner-in-west-bengal-gay-murdered-his-partner
తన భాగస్వామిని హత్య చేసిన స్వలింగ సంపర్కుడు

తన తోటి స్వలింగ సంపర్కుడిని గొంతు కోసి హత్య చేశాడు ఓ యువకుడు. ఉద్యోగరీత్యా తనను విడిచి వెళ్తున్నాడనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరిపి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బంగాల్​ ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. బర్ధమాన్ జిల్లాలోని శక్తిగఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని 19 ఏళ్ల తన్మయ్ మాలిక్​గా పోలీసులు గుర్తించారు. ఇతని ఇల్లు శక్తిగఢ్‌లో ఉన్నప్పటికీ, తల్లితో కలిసి చందన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన్మయ్.. సాఫ్ట్​వేర్ కోర్స్​ ట్రైనింగ్ తీసుకున్నాడు. అనంతరం ఉద్యోగ కోసం ప్రయత్నించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో అతనికి ఉద్యోగం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లేందుకు తన్మయ్​ సిద్ధమయ్యాడు. తన్మయ్​ బెంగళూరు వెళ్లడం తన తోటి స్వలింగ సంపర్కుడైన పింటూ ముర్ముకి ఇష్టం లేదు. ఇదే విషయాన్ని చాలా సార్లు తన్మయ్​కి కూడా చెప్పాడు. అయినా తన్మయ్ బెంగళూరు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. దీంతో తన్మయ్​పై.. పింటూ మరింత కోపం పెంచుకున్నాడు. తన్మయ్​ను చంపాలని ప్లాన్ చేశాడు.

సోమవారం.. కరోనా వ్యాక్సినేషన్​ కోసం చందన్​నగర్​ నుంచి శక్తిగఢ్​కు వచ్చాడు తన్మయ్​. వ్యాక్సిన్​ తీసుకున్న అనంతరం హెరగాచి సమీపంలోని రైల్వే గేటు వద్ద పింటూని కలిశాడు. బెంగళూరు వెళ్లవద్దని మరోసారి తన్మయ్​ని హెచ్చరించాడు. ఇదే విషయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో తన్మయ్​ గొంతును కోశాడు పింటూ. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కాపాడండి అని తన్మయ్​ అరవగా.. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న.. తన్మయ్​ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిలో ఉన్న బైక్​ ఆధారంగా విచారణ చేసిన పోలీసులు.. పింటూను నిందితుడిగా తేల్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. 'తన్మయ్​, పింటూ స్వలింగ సంపర్కులు. వీరిద్దరికి గత కొంతకాలంగా సంబంధం ఉంది. తనని విడిచి వెళ్లిపోతున్నాడనే కారణంతోనే నిందితుడు ఈ హత్య చేసినట్లుగా తెలుస్తోంది." అని పోలీసులు తెలిపారు.

ఏనుగు దాడిలో యువకుడు మృతి..
ఏనుగు దాడిలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. కేరళలోని కన్నూర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎబిన్ సెబాస్టియన్ అనే యువకుడు రాజగిరి సమీపంలో తన వ్యవసాయ పొలంలోకి వెళ్లగా.. ఏనుగు అతనిపై దాడి చేసింది. అనంతరం తీవ్రంగా గాయపడ్డ ఎబిన్.. రక్తపు వాంతులు చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని కన్నూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్​కు తరలించారు. అయిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఎబిన్​ మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Last Updated :Apr 13, 2023, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details